Breaking News
వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తన నియమాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులను, జిల్లా కలెక్టర్లను కోరారు. బుధవారం సచివాలయంలో ఆయన అధికారులతో వివిధ అంశాలపై సమావేశం నిర్వహించడంతో పాటు, జిల్లా కలెక్టర్లతో విడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచుకోవాలని, ప్రస్తుతం నడుస్తున్న పథకాలు, పనులు కొనసాగించాలని అన్నారు. ఎన్నికల కోడ్‌ అమలు కోసం కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

కొత్త ప్రెసిడెన్షల్‌ ఆర్డర్‌ అమలుకై తీసుకోవలసిన చర్యలను వివిధ శాఖలు మార్చి 31 లోగా పూర్తి చేయాలన్నారు. కొత్తగా ఎర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వులలో చేర్చేలా చూడాలన్నారు. జిఏడి ముఖ్యకార్యదర్శి అధర్‌ సిన్హా మాట్లాడుతూ వివిధ హెచ్‌వోడిలు ప్రొఫార్మా-1 పూర్తి చేశాయని, తమ శాఖలో ఉన్న పోస్టుల వివరాలను నింపారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించని ప్రత్యేక కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, ప్రొఫార్మా-5లో పూర్తి చేయాలన్నారు. బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం కాంపిటెంట్‌ అధారిటీ అనుమతితో జి.వోల జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన పోస్టులను ఆర్ధిక శాఖ చేస్తుందన్నారు. టీ వెబ్‌ పోర్టల్‌కు సంబంధించి ప్రతి శాఖ ఒక నోడల్‌ అధికారిని నియమించాలని సి.యస్‌ అన్నారు. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ 573 వెబ్‌ సైట్స్‌ ఉన్నాయని, 160 ప్యారామీటర్ల ఆధారంగా నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల వెబ్‌ సైట్లను ఇంటిగ్రేట్‌ చేసి, స్టేట్‌ పోర్టల్‌ తో లింక్‌ చేస్తామన్నారు. సైబర్‌ సెక్యూరిటి, యూజర్‌ ఫ్రెండ్లీ, పిడబ్ల్యుడి ఫ్రెండ్లీగా ఉండేలా చూస్తున్నామన్నారు. ప్రభుత్వ శాఖల సమాచారం, ఆన్‌ లైన్‌ సర్వీసెస్‌, పథకాలు ఉండేలా చూస్తున్నామన్నారు. సులభతర వాణిజ్యానికి (ఇవోడిబి) సంబంధించి అన్ని రీఫామ్స్‌ ను ఈనెల 19 వరకు పూర్తిచేయాలని సి.యస్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్స్‌, హరితహారం, మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ రెవెన్యూ, అటవీ భూముల సర్వే, సీజనల్‌ కండీషన్స్‌ పై చర్చించారు.

సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటి తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్‌ జస్టిస్‌ సి.వి. రాములు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ నియమాలపై సంబంధిత అధికారులకు అవగాహన పరచటానికి ప్రత్యేకంగా క షి చేయాలన్నారు. సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ కు సంబంధించిన యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌, ఫ్యూచర్‌ యాక్షన్‌ ప్లాన్‌ జిల్లా కలెక్టర్లు సమర్పించాలన్నారు. జిల్లా కలెక్టర్లు తమ పర్యటనలో ఈ అంశాలపై ప్రత్యేక దష్టి సారించి ప్రజలతో చర్చించాలన్నారు. నియామాలను జిల్లాలలో అమలు చేసేలా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి మాట్లాడుతూ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌పై పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మాట్లాడుతూ సాలిడ్‌ వేస్ట్‌ ను సైంటిఫిక్‌ పద్దతిలో డిస్పోజ్‌ చేసే అంశంపై ప్రత్యేక ద ష్టి సారించాలన్నారు. ఈ అంశంపై అవగాహన ఉన్న ఏజెన్సీలు, నిపుణుల బృందాలను జిల్లాలకు పంపుతామన్నారు. ప్రత్యేక కాలపరిమితిని విధించుకొని సైంటిఫిక్‌ క్యాపింగ్‌, బయోప్రాసెసింగ్‌, బయోమైనింగ్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలలో గార్బెజ్‌ కలెక్షన్‌, డంపింగ్‌ యార్డులపై ప్రత్యేక ద ష్టి సారించాలని, రాష్ట్ర స్ధాయిలో తీసుకున్న చర్యల మాదిరిగానే జిల్లా స్ధాయిలో కూడా కమిటీల ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు.

కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులకు శిక్షణా కార్యక్రమాన్ని ఈ నెల 29 లోగా పూర్తి చేయాలని సి.యస్‌ అన్నారు. శిక్షణ పొందిన సర్పంచుల నుండి ఫీడ్‌ బ్యాక్‌ సేకరించాలన్నారు. సర్పంచ్‌ లకు కేటాయించిన నిధుల వినియోగం, విధులు, భాద్యతలు, నియమాలు, గ్రామఅభివ ద్ధిపై ప్రత్యేకంగా అవగాహన పొందేలా చూడాలన్నారు. ఈ-పంచాయత్‌ సాఫ్ట్‌ వేర్‌ లో అవసరమైన డాటాను సమర్పించాలన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి మాట్లాడుతూ రెవెన్యూ, అటవీ భూముల సర్వేకు సంబంధించిన పనులు 90 శాతం పూర్తి అయ్యాయని, కేవలం 5 జిల్లాలో మిగిలి ఉందన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి, నాగర్‌ కర్నూల్‌, ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌, కొమరంభీం ఆసీఫాబాద్‌ జిల్లాలలో 20 సర్వేటీంలు పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 53.77 లక్షల ఎకరాలను రీసైక్లింగ్‌ చేశామన్నారు. ఈ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్లను కోరారు. ప్రస్తుత వేసవిని ద ష్టిలో ఉంచుకొని సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ ను అమలు చేయాలని ప్రభుత్వప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి కలెక్టర్లను కోరారు. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా వర్క్‌ షాపు నిర్వహించి గైడ్‌ లైన్స్‌ ను జారీ చేసామన్నారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌, కార్మిక తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలు ఎండబారిన పడకుండా చూడాలన్నారు. మంచినీటి కొరత ఏర్పడకుండా ప్రత్యేక ద ష్టి సారించాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన పిదపఎన్నికల నిమావళిని పాటించి నట్లు అందులో 24 గంటల ప్రభుత్వ, 24 గంటల ప్రైవేట్‌, 72 గంటలకు పబ్లిక్‌ స్థలలలో సంభందించినవి తొలగించి నట్లు చెప్పారు. ప్రవర్తన నియమావళిని సమర్ధవంతంగా అమలు చేసేందుకు వివిధ నిఘా బ ందాలు పనిచేస్తున్నట్లు చెప్పారు.వేసవిలో ప్రజలు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా సమ్మర్‌ ప్రణాలికను తయారు చేసి అధికారులు. ప్రజలు అప్రమత్తం చేసినట్లు చెప్పారు.

వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ, మునిసిపల్‌ శాఖ రెవెన్యూ శాఖల డి ఆర్‌ డి ఏ శాఖల అప్రమత్తం చేసి ప్రజలకు వడదెబ్బలు తగలకుండా అవగాహన కల్పించినట్లు చెప్పారు.పట్టణ, గ్రామీణ ప్రాంతంలో పారిశుధ్యం పై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్మెంట్‌ నిర్వహణ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ ఎం. వెంకటేశ్వర్లు, నగరపాలక కమిషనర్‌ శ్రీజాన్‌ సంసాన్‌, డి యాప్‌ ఓ డాక్టర్‌ సునీల్‌ యస్‌ హిరమన్‌ డి ఆర్‌ డి ఓ రాథోడ్‌ రమేష్‌, బోధన్‌, ఆర్ముర్‌ మునిసిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో స్పెషల్‌ సి.యస్‌ లు, అజయ్‌ మిశ్రా, చిత్రారామచంద్రన్‌, ముఖ్యకార్యదర్శులు శాంతికుమారి, రామక ష్ణారావు, సునీల్‌ శర్మ, వికాస్‌ రాజ్‌, సోమేష్‌ కుమార్‌, శాలినీ మిశ్రా, పార్ధసారధి, జగధీశ్వర్‌, శశాంక్‌ గోయల్‌, శివశంకర్‌, కార్యదర్శులు సందీప్‌ కుమార్‌ సుల్తానీయా, బి.వెంకటేశం, పంచాయతీ రాజ్‌ కమీషనర్‌ నీతూ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *