Breaking News
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి సురేశ్‌ రెంజర్ల

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురేశ్‌ రెంజర్ల

నిజామాబాద్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తనను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ న్యాయవాది సురేశ్‌ రెంజర్ల కోరారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేయాలని పట్టభద్రులను కోరారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే సెక్షన్‌ 41-ఎ, సిఆర్‌.పిసి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేయించే విధంగా లేదా రద్దుచేయించే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు.

న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వైద్య సౌకర్యం కల్పించేలా కృషి చేస్తానని జూనియర్‌ న్యాయవాదులకు రాష్ట్ర ప్రబుత్వం తరఫున స్టైఫండ్‌ వచ్చేలా కృషి చేస్తామని, అదేవిధంగా న్యాయవాదుల కొరకు ప్రత్యేకంగా ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధి కల్పనలో పట్టభద్రులకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌కు కృషి చేస్తానని, నిరుద్యోగ పట్టభద్రులకు జీవన భృతి కింద ప్రభుత్వంచే వారికి ప్రతినెల ఆర్థిక సాయం అందేలా చూస్తానన్నారు. ఎలాగైనా తనను ఎమ్మెల్సీగా గెలిపించి అన్ని వర్గాల వారికి సేవచేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

Check Also

చెక్కుల పంపిణీ

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన 25.05 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *