Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న రుద్రమ గోగుల

ఆదరించండి అండగా ఉంటా

నిజామాబాద్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న కరీంనగర్‌, మెదక్‌ నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టబద్రుల నియోజక ఎమ్మెల్సీ స్థానానికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని రుద్రమా గోగుల కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యమ కారిణిగా, పాత్రికేయురాలిగా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను నిర్వహించిన పాత్ర తెలిసిందేనన్నారు. ఎంసీఏ పూర్తి చేసిన తాను సాఫ్ట్వేర్‌ రంగంలో అనేక అవకాశాలున్నా జర్నలిజంపై మక్కువతో ఎంసీజే పూర్తి చేశానని, ప్రజా జీవితంలోకి రావాలని మక్కువతొ జర్నలిజంలోకి వచ్చానని ఆమె అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు విద్య, వైద్య ప్రతి అంశంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఉద్యమస్ఫూర్తిని కలిగించడంలో తాను సైతం అంటూ కదిలానని, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, జర్నలిజంలో రెండు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ తనకు వ్యక్తిగతంగా అనేక ఉపాధి అవకాశాలు వచ్చాయని, కానీ అన్యాయంగా వివక్షకు గురైన మాత భూమి తెలంగాణ ప్రజల గొంతుకె ఉన్న ఆనందం ముందు నన్ను ఏఅవకాశాలు ఆకర్షించలేకపోయాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ పట్ట బద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులకు పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో సిపిఎస్‌ పైన తమ విధానం ఏమిటని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఆగిపోయాయని తమ వైఖరి ఏమిటని, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ ద్వార బదిలీలు జరగాలి కాని ముఖ్యమంత్రి కాలం నుండి ట్రాన్స్ఫర్‌ ఆర్డర్స్‌ తీసుకుంటున్నారు.

ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ పట్టభద్రులు వారి బతుకు తెరువు కోసం స్థాపించిన ప్రైవేట్‌ పాఠశాలల, కళాశాలల భద్రత ఎందుకు ప్రశ్నార్థకమవుతుందని, రాష్ట్రంలో కార్పొరేట్‌ కళాశాలలు ఎందుకు రాజ్యమేలుతున్నాయని, ఉద్యోగ ఖాళీలకు నియామకాలకు సంబంధించి ప్రతి ఏటా అకడమిక్‌ క్యాలెండర్‌ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. రానున్న కరీంనగర్‌ ,మెదక్‌ నిజామాబాద్‌, అదిలాబాద్‌ పట్ట బద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, బ్యాలెట్‌ పేపర్లో తన సీరియల్‌ నెంబర్‌ 3(మూడు) అని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే అన్నీ రంగాల్లో పని చేస్తున్న వారికి అండగా వుంటానని రాణి రుద్రమ గోగుల తెలిపారు.

Check Also

ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *