Breaking News
మహిళలకు శ్రీమంతాలు చేస్తున్న సూపర్‌వైజర్‌

మహిళలకు పోషక లోపాలు లేకుండా చూడాలి

రెంజల్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలకు, మహిళలకు పోషకాలలో లోపాలు లేకుండా చూడాలని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల అన్నారు. శిశుసంక్షేమ శాఖ ఆద్వర్యంలో పోషన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని గురువారం మండలంలోని పలు గ్రామాల్లో ఐసిడిఎస్‌ ఆద్వర్యంలో అంగన్‌వాడి కేంద్రాల్లో పోషణ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. కిషోర బాలికలకు పోషకాహారంపై అవగాహన నిర్వహించి బాల్య వివాహాలు విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు గర్భిణీ స్త్రీలు తప్పక పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు. అనంతరం అంగన్‌వాడి కేంద్రాల్లో మహిళలకు శ్రీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *