Breaking News
వేలం నిర్వహిస్తున్న సర్పంచ్‌

తైబజార్‌ వేలం

రెంజల్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ అయిన సాటాపూర్‌ తైబజార్‌ వేలంను గురువారం సర్పంచ్‌ వికార్‌ పాషా, కార్యదర్శి రఘురాం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. వివిద గ్రామాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. 10 లక్షల 12 వేల రూపాయలకు సాటాపూర్‌ గ్రామానికి చెందిన మునీర్‌ అనే వ్యాపారస్తుడు తైబజార్‌ను వేలంలో పొందారు. తైబజార్‌ కాలపరిమితి ఒక సంవత్సర కాలానికి సంబంధించినదని కార్యదర్శి తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, కార్యదర్శి శ్రీకాంత్‌, సాయిలు, నితిన్‌, గంగారాం, శంషోద్దీన్‌, శ్రీకాంత్‌, ముంతాజ్‌ తదితరులున్నారు.

Check Also

వైభవోపేతంగా బ్రహ్మూెత్సవాలు

కామారెడ్డి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *