Breaking News
డాక్టర్‌ క్రిష్టినాకు బహుమతి అందజేస్తున్న జిల్లా వైద్య అధికారి

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

రెంజల్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని జిల్లా వైద్యాధికారి సుదర్శనం అన్నారు. గురువారం రెంజల్‌ మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో మహిళా దినోత్సవం ప్రాముఖ్యత ప్రపంచంలోని మహిళలు సాధించిన విషయాలను వివరించారు.

మహిళలు మునుముందు మరింత అభివద్ధి చెంది మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో సమానంగా ఉన్నారన్నారు. చేసే ప్రతిపనిలో నిబద్ధత కలిగి ఉండాలన్నారు. అనంతరం వైద్యాధికారి క్రిష్టినాకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఈవోలు వెంకటరమణ, విజయ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *