Breaking News
రక్తదానం చేస్తున్న తెరాస నాయకులు

ఘనంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

మోర్తాడ్‌, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించారు. 25 మంది తెరాస కార్యకర్తలు రక్తదానం చేసినట్టు ఏర్గట్ల మండల పార్టీ అధ్యక్షుడు రాజాపూర్ణానందం తెలిపారు. అలాగే గ్రామంలో మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల ఉమ్మడి జడ్పిటిసి ఎనుగందుల అమిత కేక్‌కట్‌ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి జిల్లా మరింత అభివృద్ది చెందేలా చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మండల క్రీడా పోటీలు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల అంతర పాఠశాలల క్రీడలు వెల్మల్‌ ప్రభుత్వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *