Breaking News

Daily Archives: March 15, 2019

తెరాస.. తెలంగాణ ప్రజల టీం

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి ఏ జాతీయ పార్టీకి బీటీమ్‌ కాదని కేవలం తెలంగాణ ప్రజలకు బిటీమ్‌ అని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజలు జాతీయ పార్టీలు వద్దు.. లోకల్‌ పార్టీలు ముద్దు అనుకుంటున్నారని, టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణ సమస్యలు, ప్రజలు ముఖ్యమని, అదే జాతీయ పార్టీలకు ఎన్నో అంశాలు ఉంటాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలతో ...

Read More »

దళితుల అభివృద్ధికి ఎంపి కృషి

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు మాలల ఐక్య వేదిక నాయకులు రూ. లక్ష 16 వేల చెక్‌ అందజేశారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, రవాణా శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వి.జి గౌడ్‌, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచిన కవితకు ఎన్నికల ఖర్చు కోసం మాలలు ప్రతి ఇంటి నుంచి కొంత నగదు ...

Read More »

సిఎం సభాస్థలిని పరిశీలించిన ఎంపి కవిత

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిజామాబాద్‌ రానున్న నేపథ్యంలో సభజరిగే స్థలాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి, ఎంపి స్థానిక నాయకులకు ఆదేశించారు. సాద్యమైనంత వరకు షామియానాలు అందుబాటులో ఉంచుకోవాలని, ఎండల ప్రభావం ఉన్నందున తాగునీరు, ఓఆర్‌ఎస్‌ అధిక మొత్తంలో సిద్దంగా ఉంచాలని సూచించారు. హెలిప్యాడ్‌ ...

Read More »

‘మూలధ్వని’ గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జానపద, గిరిజన సంగీత వాయిద్యాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కర్షక్‌ బిఇడి కళాశాలలో వేదిక ఆధ్వర్యంలో మూలధ్వని గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గఫూర్‌ శిక్షక్‌ మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి జానపద కళారూపాలే ఊతమిచ్చాయని, అలాంటి కళలను ఆదరించాలన్నారు. తెరవే ఆధ్వర్యంలో ఈనెల 17,18 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్‌ ఆడిటోరియంలో ...

Read More »

ప్రజాసమస్యలపై నిర్విరామ పోరాటం

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యలపై నిర్విరామ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం అన్నారు. శుక్రవారం మద్నూర్‌ మండల కేంద్రంలో జరిగిన పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా నగేశ్‌ను ఈనెల 12న జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో నియమించినట్టు పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, రైతులకు స్వామినాథన్‌ సిఫారసుల అమలు, కెజి నుంచి పిజి ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, తదితర సమస్యలపై పోరాటం ...

Read More »

మొక్కల పరిరక్షణ అందరి బాధ్యత

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం వాటరింగ్‌ డే సందర్భంగా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలకు నీరందించారు. అనంతరం మాట్లాడుతూ హరితహారంలో అధికారులు, ప్రజాప్రతినిదులు గ్రామస్తులు విద్యార్థులందరు భాగస్వాములు కావాలని, హరిత తెలంగాణను సాదించుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఎండివో చెన్నారెడ్డి, తహసీల్దార్‌ ...

Read More »

విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్‌ బాలుర పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న 41 మంది విద్యార్థులకు పరీక్షల కిట్‌లు జిల్లా కలెక్టర్‌ బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా కంఫర్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం 7661854856 కంట్రోల్‌ ...

Read More »

ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో పోలింగ్‌రోజున ప్రీసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రీసైడింగ్‌ అదికారుల పాత్ర అతి ముఖ్యమని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం 05- జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి ఎల్లారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రీసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రీసైడింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారులు కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ యంత్రాల నెంబర్లు నోటు చేసుకోవాలని, ...

Read More »

నసురుల్లాబాద్‌ పోలీసు హెచ్చరిక

బీర్కూర్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ త్రాగు నీటికి సంబందించిన పైప్‌లైన్‌లను కొంత మంది రైతులు అక్రమంగా పగులగొట్టి తమ పంట పొలాలకు వాడుకుంటున్నారని నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ సందీప్‌ అన్నారు. ఈ విదంగా చేయడం వలన ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ త్రాగునీరు పథకం యొక్క సదుద్దేశాన్ని చెడగొట్టినవారవుతారు కాబట్టి అటువంటి వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయబడతాయన్నారు. విషయాన్ని గమనించి రైతులు నడుచుకోవాలని, పైప్‌లైన్‌లను పగులగొట్టవద్దని పేర్కొన్నారు.

Read More »

బియ్యం పట్టివేత

నందిపేట్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ఐలాపూర్‌ గ్రామానికి చెందిన ఎస్‌.ప్రతాప్‌ అనే బియ్యపు వ్యాపారి ఇంట్లో అధికారులు సోదాలు చేసి 31 ప్లాస్టిక్‌ బస్తాలలో 16.70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనపరచుకున్నారు. శుక్రవారం ఉదయం ఫోన్లో అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ రాఘవేందర్‌ సిబ్బందితో హుటాహుటిన చేరుకొని తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉన్న రేషన్‌ బియ్యం అశోక్‌ లేలాండ్‌ ఎంహెచ్‌ 26 ఎడి 7434 గల వాహనంలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ...

Read More »

పరీక్ష అట్టల పంపిణీ

రెంజల్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శుక్రవారం ఉపాధ్యాయ సిబ్బంది పరీక్ష అట్టల వితరణ చేశారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ పీ.బీ.కష్ణమూర్తి నిజామాబాద్‌ వారి ప్రోత్సాహంతో విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిలు, పిఆర్టియు రాష్ట్ర కార్యదర్శి రాజేందర్‌ సింగ్‌, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ రెడ్డి, రాజు, సునీల్‌, గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

21,24 తేదీల్లో నామినేషన్లు స్వీకరించబడవు

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ఈనెల 21,24 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నందున నామినేషన్లు స్వీకరించబడవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 18న నోటిఫికేషన్‌ జారీచేయడంతో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్‌ దాఖలుకు ఈనెల 25 చివరితేదీ అని, ఎన్నికల కమీషన్‌ ఆదేశానుసారం ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించబడవని, ఈనెల 21న హోలీ, 24న ఆదివారం ఉన్నందున రెండు సెలవు రోజుల్లో నామినేషన్లు ...

Read More »

మాక్‌ పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలు జరిగే ఒకరోజు ముందు మాక్‌పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండ్రోజుల పాటు పోలింగ్‌ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన సిబ్బందితో మాట్లాడారు. మాక్‌పోలింగ్‌ చాలా ముఖ్యమైందని, పోలింగ్‌ ప్రారంభం కావడానికి ముందుగానే మాక్‌పోలింగ్‌ నిర్వహించాలని అవసరమనుకుంటే ఈవిషయాన్ని బోర్డుపై రాసిపెట్టుకోవాలని, అంతేకా సిఆర్‌సి అంటే క్లోజ్‌ రిజల్డ్‌ క్లియర్‌ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ...

Read More »

ప్రచార సామగ్రి వివరాలు అందజేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారం కొరకు ముద్రించే సామగ్రి వివరాలు సంబంధిత ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులు జిల్లా కలెక్టర్‌కు, ఎన్నికల అధికారులకు తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌ సమావేశమందిరంలో జిల్లాలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌-127-ఎ ప్రకారం ఎన్నికలకు సంబంధించి కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బుక్‌లెట్లు తదితర ప్రచురణలు చేస్తే తప్పనిసరిగా వాటి వివరాలు ...

Read More »

అమరవీరుల త్యాగాలు అభాసుపాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అమరవీరుల త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలు చేసిందని తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక నాయకులు మోహన్‌ ఆరోపించారు. శుక్రవారం స్తానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్లమెంటు స్థానాల్లో వందలాది నామినేషన్లు వేసి నిరసన తెలుపుతున్నట్టు ఆయన అన్నారు. ఉద్యమకారులను, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను రోడ్డు పాలు చేసినందున ...

Read More »

పట్టభద్రుల అభ్యర్థి రణజిత్‌మోహన్‌ను గెలిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రణజిత్‌ మోహన్‌ను గెలిపించాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌గౌడ్‌ అన్నారు. రణజిత్‌ మోహన్‌ ప్రచారంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్‌లో, బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 41-ఎ సిఆర్‌పిసి రద్దుకై కట్టుబడి ఉన్నానని, జూనియర్‌ న్యాయవాదుల ఉపకార వేతనాల కోసం కృషి చేస్తానని, హెల్‌ కార్డుల కోసం న్యాయవాద సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. లా గ్రాడ్యుయేట్‌ చదివిన ...

Read More »

మరింత బలపడిన బిజెపి

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2014తో పోల్చుకుంటే 2019 నాటికి భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలపడిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి బలపరిచిన ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి సుధాకర్‌రావుకు మద్దతు తెలుపుతూ ప్రచారం కొరకు జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 11 వరకు ఏడు దఫాలుగా దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, ...

Read More »