Breaking News

21,24 తేదీల్లో నామినేషన్లు స్వీకరించబడవు

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకొని ఈనెల 21,24 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నందున నామినేషన్లు స్వీకరించబడవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈనెల 18న నోటిఫికేషన్‌ జారీచేయడంతో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్‌ దాఖలుకు ఈనెల 25 చివరితేదీ అని, ఎన్నికల కమీషన్‌ ఆదేశానుసారం ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించబడవని, ఈనెల 21న హోలీ, 24న ఆదివారం ఉన్నందున రెండు సెలవు రోజుల్లో నామినేషన్లు తీసుకోబడవని, మిగతా పనిదినాల్లో నామినేషన్లు ఉదయం 11 నుంచి 3 గంటల వరకు మాత్రమే స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *