Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న మురళీధర్‌రావు

మరింత బలపడిన బిజెపి

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2014తో పోల్చుకుంటే 2019 నాటికి భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా మరింత బలపడిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి బలపరిచిన ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి సుధాకర్‌రావుకు మద్దతు తెలుపుతూ ప్రచారం కొరకు జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 11 వరకు ఏడు దఫాలుగా దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, ఎన్డీయే కూటమికి భారీ మెజార్టీ లభిస్తుందని, తిరిగి అదికారం చేపట్టడం ఖాయమని ఆయన అన్నారు.

దేశంలో సుస్థిరపాలన కేవలం బిజెపితోనే సాధ్యమని, కొన్ని పార్టీలు మహాకూటమి, మహా ఘటబందన్‌ అంటూ నాటకాలకు తెరలేపి స్వార్థ రాజకీయాల కోసం దేశ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎన్డీయే కూటమి మరింత బలపడిందని, మోడి ప్రభావాన్ని ఓర్వలేకనే మహాకూటమి, మహాగటబందన్‌ లాంటివి ఏర్పాటు చేశారని, అవి ఒక నిర్దిష్ట ప్రణాళికతో లేవని, ఎవరికి వారే యమునా తీరే లాగా పార్టీల ప్రవర్తన ఉందని మురళీదర్‌రావు ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో శివసేనతో ఉమ్మడిగా ముందుకు వెళుతుందని, బీహార్‌లో జెడియుతో జత కట్టడం జరిగిందని, పంజాబ్‌లో అకాళీదళ్‌, ఈశాన్య రాస్ట్రాల్లో అనేక పార్టీలు బిజెపితో జత కట్టడానికి ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. తమిళనాడులో ఏఐడిఎంకెతోపాటు పిఎంకె, డిఎండికె, కృష్ణస్వామి, వాసన్‌, బిజెపితో ముందుకు సాగుతున్నాయని, ఇది దక్షిణ భారతదేశంలో బిజెపికి మరింత కలిసివచ్చే అంశమని, కొన్ని ప్రాంతీయపార్టీలు బిజెపిని ఉత్తరాది పార్టీగా అభివర్ణిస్తు తప్పుడు ప్రచారం నిర్వహిస్తుందని, అలాంటపుడు ప్రస్తుతమున్న పోలింగ్‌శాతంతో చూసుకుంటే దక్షిణ భారతదేశంలోనే బిజెపి మెరుగైన ప్రదర్శన ఉందని, బిజెపిది జాతీయ వాదమని మురళీదర్‌రావు స్పష్టం చేశారు.

ఎన్డీయే కూటమి ముఖ్యంగా మూడు అంశాలపై పాలన కొనసాగిస్తుందని, మొదటిది అభివృద్ది, రెండవది సంక్షేమ పథకాలు, మూడవది దేశరక్షణ అంశాలపై నడుస్తుందని అన్నారు. గత ఐదేళ్లలో దేశ అభివృద్ది ఎంతో గణనీయంగా పెరిగి ప్రపంచ దేశాలను భారత్‌వవైపు ఆకర్షిస్తున్నాయని ఆయన అన్నారు. స్వచ్చభారత్‌, స్వచ్చఅభియాన్‌, జన్‌ధన్‌, ఉజ్వల, ప్రధానమంత్రి సరళ్‌ యోజన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత బిజెపిదేనన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు యెండల లక్ష్మినారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వా లక్ష్మినర్సయ్య, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, యెండల సుధాకర్‌, జిల్లా అధికార ప్రతినిది శ్రీనివాస్‌ శర్మ తదితరులున్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *