Breaking News
విద్యార్థులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి

కామారెడ్డి, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్‌ బాలుర పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న 41 మంది విద్యార్థులకు పరీక్షల కిట్‌లు జిల్లా కలెక్టర్‌ బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా కంఫర్ట్‌గా, కాన్ఫిడెంట్‌గా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షల నిర్వహణ కోసం 7661854856 కంట్రోల్‌ రూం నెంబరు ద్వారా 24 గంటలు సేవలందించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాల ద్వారా 17 వేల 767 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్టు చెప్పారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల కో ఆర్డినేటర్‌ దేవిదాస్‌, ప్రిన్సిపాల్‌ భాస్కరస్వామి, వైస్‌ప్రిన్సిపాల్‌ భరత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *