Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న ఎంసిపిఐయు

ప్రజాసమస్యలపై నిర్విరామ పోరాటం

కామారెడ్డి, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యలపై నిర్విరామ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం అన్నారు. శుక్రవారం మద్నూర్‌ మండల కేంద్రంలో జరిగిన పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా నగేశ్‌ను ఈనెల 12న జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో నియమించినట్టు పేర్కొన్నారు.

కార్మికులకు కనీస వేతనాలు, రైతులకు స్వామినాథన్‌ సిఫారసుల అమలు, కెజి నుంచి పిజి ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, తదితర సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, హమీద్‌, హన్మంత్‌రావు, సాయిలు, దిగంబర్‌, హనుమంతు, లక్ష్మణ్‌ తదితరులున్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *