Breaking News
మొక్కలకు నీరందిస్తున్న జిల్లా కలెక్టర్‌

మొక్కల పరిరక్షణ అందరి బాధ్యత

కామారెడ్డి, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం వాటరింగ్‌ డే సందర్భంగా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలకు నీరందించారు.

అనంతరం మాట్లాడుతూ హరితహారంలో అధికారులు, ప్రజాప్రతినిదులు గ్రామస్తులు విద్యార్థులందరు భాగస్వాములు కావాలని, హరిత తెలంగాణను సాదించుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఎండివో చెన్నారెడ్డి, తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *