Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం

కామారెడ్డి, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో పోలింగ్‌రోజున ప్రీసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రీసైడింగ్‌ అదికారుల పాత్ర అతి ముఖ్యమని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం 05- జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించి ఎల్లారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రీసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రీసైడింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారులు కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీప్యాట్‌ యంత్రాల నెంబర్లు నోటు చేసుకోవాలని, చెక్‌లిస్టు ప్రకారం పోలింగ్‌ సామగ్రిని పొందాలని, అన్ని నిబంధనలు పాటించాలని సూచించారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత చేయాల్సిన పనులను వివరించారు.

అదే నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఫాం-12 బి ద్వారా ఎలక్షన్‌ డ్యూటీ సర్టిఫికెట్‌ పొంది తాము విదులు నిర్వహిస్తున్న పోలింగ్‌ స్టేషన్‌లోనే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 786 పోలింగ్‌ కేంద్రాల ద్వారా పోలింగ్‌ నిర్వహణ జరుగుతుందని, 4100 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈనెల 22న ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌ నిర్వహించబడుతుందని అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపిడివో చెన్నారెడ్డి, తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *