Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

మాక్‌ పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలు జరిగే ఒకరోజు ముందు మాక్‌పోలింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండ్రోజుల పాటు పోలింగ్‌ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన సిబ్బందితో మాట్లాడారు. మాక్‌పోలింగ్‌ చాలా ముఖ్యమైందని, పోలింగ్‌ ప్రారంభం కావడానికి ముందుగానే మాక్‌పోలింగ్‌ నిర్వహించాలని అవసరమనుకుంటే ఈవిషయాన్ని బోర్డుపై రాసిపెట్టుకోవాలని, అంతేకా సిఆర్‌సి అంటే క్లోజ్‌ రిజల్డ్‌ క్లియర్‌ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, మాక్‌పోలింగ్‌ పూర్తికాగానే స్లిప్పులు బయటకు తీసి సరిచూసుకొని బ్లాక్‌ కవర్స్‌లో భద్రపరిచి ఈవిఎం క్లోజ్‌చేసి క్లియర్‌ చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

కార్యక్రమంలో నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు జ్వాలాగిరి రావు, వేణు, విష్ణుసాగర్‌, ఎంపిడివో సంజీవ్‌ తదితరులు ఉన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *