Breaking News
పట్టుకున్న రేషన్‌ బియ్యం

బియ్యం పట్టివేత

నందిపేట్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ఐలాపూర్‌ గ్రామానికి చెందిన ఎస్‌.ప్రతాప్‌ అనే బియ్యపు వ్యాపారి ఇంట్లో అధికారులు సోదాలు చేసి 31 ప్లాస్టిక్‌ బస్తాలలో 16.70 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనపరచుకున్నారు. శుక్రవారం ఉదయం ఫోన్లో అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ రాఘవేందర్‌ సిబ్బందితో హుటాహుటిన చేరుకొని తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉన్న రేషన్‌ బియ్యం అశోక్‌ లేలాండ్‌ ఎంహెచ్‌ 26 ఎడి 7434 గల వాహనంలో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా వాహనాన్ని డ్రైవర్‌ని సైతం అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు అందజేయడంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ అధికారి రాజేశ్వర్‌ బియ్యం కే .చంద్రకళ ఎఫ్‌పిఎస్‌ నెంబరు 26 మారంపల్లి గ్రామానికి చెందినవిగా నిర్ధారించారు. ప్రతాప్‌ ఐలాపూర్‌, వాహనా యజమాని మహమ్మద్‌ వసీం – ధర్మాబాద్‌ నాందేడ్‌ జిల్లా, మహారాష్ట్ర, డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో నందిపేట్‌ క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని తెలిపారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *