Breaking News

నసురుల్లాబాద్‌ పోలీసు హెచ్చరిక

బీర్కూర్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ త్రాగు నీటికి సంబందించిన పైప్‌లైన్‌లను కొంత మంది రైతులు అక్రమంగా పగులగొట్టి తమ పంట పొలాలకు వాడుకుంటున్నారని నసురుల్లాబాద్‌ ఎస్‌ఐ సందీప్‌ అన్నారు. ఈ విదంగా చేయడం వలన ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ త్రాగునీరు పథకం యొక్క సదుద్దేశాన్ని చెడగొట్టినవారవుతారు కాబట్టి అటువంటి వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయబడతాయన్నారు. విషయాన్ని గమనించి రైతులు నడుచుకోవాలని, పైప్‌లైన్‌లను పగులగొట్టవద్దని పేర్కొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *