Breaking News
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రతినిధులు

అమరవీరుల త్యాగాలు అభాసుపాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అమరవీరుల త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలు చేసిందని తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక నాయకులు మోహన్‌ ఆరోపించారు. శుక్రవారం స్తానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్లమెంటు స్థానాల్లో వందలాది నామినేషన్లు వేసి నిరసన తెలుపుతున్నట్టు ఆయన అన్నారు.

ఉద్యమకారులను, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను రోడ్డు పాలు చేసినందున తెరాస భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని, తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వమని చెప్పుకుంటున్న కెసిఆర్‌ను ప్రశ్నిస్తామని, ఉద్యమానికి ఏమాత్రం సంబందంలేదని ఎర్రబెల్లి, తలసాని, మల్లారెడ్డిలకు ఉద్యమంలో ఏపాత్ర ఉందని వారికి కీలకపదవులు అంటగట్టారని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో సతీష్‌, సరిత, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *