Breaking News
ఎంపికి చెక్‌ అందజేస్తున్న నాయకులు

దళితుల అభివృద్ధికి ఎంపి కృషి

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవితకు మాలల ఐక్య వేదిక నాయకులు రూ. లక్ష 16 వేల చెక్‌ అందజేశారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాలు, రవాణా శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ వి.జి గౌడ్‌, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎమ్మెల్యేలు గణేష్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ పాల్గొన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచిన కవితకు ఎన్నికల ఖర్చు కోసం మాలలు ప్రతి ఇంటి నుంచి కొంత నగదు విరాళాల రూపంలో సేకరించిన విషయం తెలిసిందే.

శుక్రవారం నిజామాబాదులో మాలల ఐక్యవేదిక నిజామాబాద్‌ జిల్లా చైర్మన్‌ జి.జనార్ధన్‌, కోచైర్మన్‌ పి.స్వామి ఆధ్వర్యంలో వేదిక నాయకులు ఎంపి కవితను కలిసి చెక్‌ అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మాలల ఐక్య వేదిక జిల్లా మోహనరావు, ఎల్లం, భూమయ్య, దేవిదాస్‌, సురేష్‌ , లక్ష్మీ నారాయణ, లింగయ్య, ధనరాజు, శ్రీనివాస్‌, నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు, ఎమ్మార్పీఎస్‌, గోసంగి, మోచి సంఘం, మాల జంగం, ఇతర దళిత సంఘాల జిల్లా నాయకులు ఎంపీ కవితను సన్మానించారు. దళితుల అభివద్ధికి కషిచేసిన కవితను మళ్లీ ఎంపీగా గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *