Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

ప్రచార సామగ్రి వివరాలు అందజేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రచారం కొరకు ముద్రించే సామగ్రి వివరాలు సంబంధిత ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులు జిల్లా కలెక్టర్‌కు, ఎన్నికల అధికారులకు తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌ సమావేశమందిరంలో జిల్లాలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌-127-ఎ ప్రకారం ఎన్నికలకు సంబంధించి కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, బుక్‌లెట్లు తదితర ప్రచురణలు చేస్తే తప్పనిసరిగా వాటి వివరాలు రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలన్నారు.

లేనియెడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఎన్నికల కమీషన్‌ రూపొందించిన అపెండిక్స్‌-ఎ, బిలలో సమర్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఆయా ప్రెస్‌ల యజమానులు, ప్లెక్సీ ప్రింటర్స్‌ యజమానులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *