Breaking News
గోడప్రతులు ఆవిష్కరిస్తున్న తెరవే ప్రతినిధులు

‘మూలధ్వని’ గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జానపద, గిరిజన సంగీత వాయిద్యాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కర్షక్‌ బిఇడి కళాశాలలో వేదిక ఆధ్వర్యంలో మూలధ్వని గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గఫూర్‌ శిక్షక్‌ మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి జానపద కళారూపాలే ఊతమిచ్చాయని, అలాంటి కళలను ఆదరించాలన్నారు. తెరవే ఆధ్వర్యంలో ఈనెల 17,18 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్‌ ఆడిటోరియంలో మూలధ్వని జానపద గిరిజన సంగీత వాయిద్య సమ్మేళనం ఉంటుందని తెలిపారు. ఇందులో 66 రకాల ఆదివాసీ వాయిద్య సంగీత కళలను 200 మంది ప్రదర్శిస్తారని తెలిపారు.

వాయిద్య సమ్మేళనంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెరవే జిల్లా బాధ్యులు గంగాప్రసాద్‌, పీతాంబర్‌, నాగభూషణం, అల్లిమోహన్‌రాజ్‌, చంద్రకాంత్‌, ఉపాధ్యాయ సంఘ బాధ్యులు, విజయ రామరాజు, రాంచంద్రం తదితరులున్నారు.

Check Also

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *