Breaking News
సభాస్థలిని పరిశీలిస్తున్న మంత్రి, ఎంపి తదితరులు

సిఎం సభాస్థలిని పరిశీలించిన ఎంపి కవిత

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిజామాబాద్‌ రానున్న నేపథ్యంలో సభజరిగే స్థలాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి, ఎంపి స్థానిక నాయకులకు ఆదేశించారు. సాద్యమైనంత వరకు షామియానాలు అందుబాటులో ఉంచుకోవాలని, ఎండల ప్రభావం ఉన్నందున తాగునీరు, ఓఆర్‌ఎస్‌ అధిక మొత్తంలో సిద్దంగా ఉంచాలని సూచించారు. హెలిప్యాడ్‌ స్థలాన్ని కూడా ఈ సందర్భంగా పరిశీలించారు. వీరి వెంట అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, తెరాస పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఏ.ఎస్‌.పోశెట్టి, నుడా ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఆకుల శ్రీశైలం, జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, తదితరులున్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *