Breaking News
బార్‌ అసోసియేషన్‌లో మాట్లాడుతున్న రణజిత్‌ మోహన్‌

పట్టభద్రుల అభ్యర్థి రణజిత్‌మోహన్‌ను గెలిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రణజిత్‌ మోహన్‌ను గెలిపించాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌గౌడ్‌ అన్నారు. రణజిత్‌ మోహన్‌ ప్రచారంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్లబ్‌లో, బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 41-ఎ సిఆర్‌పిసి రద్దుకై కట్టుబడి ఉన్నానని, జూనియర్‌ న్యాయవాదుల ఉపకార వేతనాల కోసం కృషి చేస్తానని, హెల్‌ కార్డుల కోసం న్యాయవాద సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. లా గ్రాడ్యుయేట్‌ చదివిన అడ్వకేట్‌ సమస్యలపై తనకు అవగాహన ఉందని, ప్రబుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టభద్రుల నిరుద్యోగుల భవిష్యత్తుకై రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్సీ అభ్యర్తిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచే ఆరెస్సెస్‌, విద్యార్థి పరిషత్‌ సామాన్య కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగి మూడుసార్లు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినట్టు గుర్తుచేశారు. విద్యార్తి పోరాటాలపై చురుకుగా పనిచేశానని, ఈ విషయం తెలంగాణలో చాలామందికి తెలుసునన్నారు. కావున పట్టభద్రులందరు మొదటి ప్రాధాన్యత ఓటు తనకే వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్‌ గౌడ్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి కేశవరావు, ఉపాధ్యక్షులు దేవిదాస్‌, సీనియర్‌ న్యాయవాదులు ఈగ గంగారెడ్డి, ఆకుల రమేశ్‌, అశోక్‌, ఆశ నారాయణ, కృపాకర్‌రెడ్డి, వెంకటేశ్‌, రవి, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్తి నాయకులు తదితరులున్నారు.

Check Also

సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ

రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రైతులకు సోమవారం నుండి జీలుగ విత్తనాలు పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *