Breaking News

Daily Archives: March 16, 2019

ఎంపి కవిత ‘ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌’ :వినూత్నంగా నియోజకవర్గ అభివృద్ధి ప్రగతి నివేదిక.

నిజామాబాద్‌ ప్రతినిధి మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినాక, ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బంగారు తెలంగాణ దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. ఈక్రమంలో తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా, జగిత్యాల జిల్లాలు కూడా ఆయా రంగాల్లో చెప్పుకోదగిన అభివృద్ది సాధించినాయి. షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి, కెసిఆర్‌ కిట్‌, ఆసరా పింఛన్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. అంతేగాకుండా అనేకపనులు ప్రగతి పథంలో సాగుతున్నాయి. ఎవరైనా ...

Read More »

ఆదపలో…ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు…

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట మాడల్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్తి సుశాంత్‌కుమార్‌ యుకెమియా వ్యాధి (బ్లడ్‌ క్యాన్సర్‌)తో బాధపడుతూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. నిజాంసాగర్‌ మండలం ఆరేడ్‌ గ్రామానికి సుశాంత్‌ హైదరాబాద్‌లోని బస్వతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స కోసం సుమారు 15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. సుశాంత్‌ను కాపాడుకోవడానికి తల్లి ఒంటరిగా నిస్సహాయురాలై ఎదురుచూస్తుంది. సహృదయులు సహాయం చేస్తారని ఆశతో ఉంది. ఆర్తిక సహాయం చేసి ...

Read More »

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి రాజు డిమాండ్‌ చేశారు. కామారెడ్డిలో శనివారం యూనియన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఐటియు కేంద్ర స్థాయిలో పోరాడి సాధించిన చట్టాన్ని పక్కదారి పట్టించేవిధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ద్వారా వచ్చిన సంక్షేమాలను అమలు చేయకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నాయన్నారు. 60 సంవత్సరాలు నిండిన ...

Read More »

పరీక్షా కేంద్రాల తనిఖీ

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్‌ స్కూల్‌ పరీక్షా కేంద్రాన్ని ఆయన పర్యవేక్షించారు. అక్కడ పరీక్షలు జరుగుతున్నతీరు, ఏర్పాట్లు, నిర్వహణ తదితరాలపై ఆరాతీశారు. ఒక్కో గదిని పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖాధికారి రాజు, అధికారులు ఉన్నారు.

Read More »

ఎన్నికల ఏర్పాట్లపై పార్టీ నాయకులతో సమీక్ష

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం జనహితతో రాజకీయ పార్టీల నాయకులతో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో 1400 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 1200 మంది ఓటర్లకన్నా ఎక్కువ ఉంటే వేరే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి ఆయన నాయకులతో చర్చించారు. పోలింగ్‌ కేంద్రాలపై వారికి స్పష్టత ఇచ్చారు. సమావేశంలో కామారెడ్డి ...

Read More »

మీడియా కేంద్రంలో రికార్డు ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రంలో రికార్డు ప్రక్రియను శనివారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లోకల్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే వార్తలను 24 గంటలపాటు రికార్డుచేసి ఎన్నికల వార్తలు నిబందనల మేరకు ఉందో లేదో పరిశీలించి సంబంధిత అభ్యర్థులకు అనుమానాస్పద పెయిడ్‌ న్యూస్‌గా భావించి నోటీసులు జారీచేస్తామని తెలిపారు. అదేవిధంగా వివిధ న్యూస్‌పేపర్లలో ప్రచురితమైన వార్తలను కూడా పరిశీలించి ...

Read More »

ఆలయంలో దొంగ…

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోగల కేశాపూర్‌ గ్రామంలో మహాలక్ష్మి ఆలయంలో హుండి చోరీచేస్తున్న వ్యక్తిని ఆలయ సమీపంలోగల అగ్రిగోల్డ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ గుర్తించి అదే సంస్థలో పనిచేస్తున్న గంగారెడ్డికి విషయం తెలియజేశాడు. ఇద్దరు కలిసి ఆలయంవైపు వెళ్లిచూడగా వీరిని గమనించిన దొంగ పారిపోయాడు. అతన్ని వెంబడించి పట్టుకొని విచారించగా అతడు కామారెడ్డి జిల్లా రాజంపేట్‌ మండలం ఎల్లారెడ్డిపల్లి తాండాకు చెందిన లంబాడి ప్రశాంత్‌గా గుర్తించారు. ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ...

Read More »

దేశాభివృద్దిలో విద్యార్థుల పాత్ర కీలకం

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశాభివృద్దిలో విద్యార్థుల పాత్ర కీలకమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన నిశిత డిగ్రీ కళాశాల సిల్వర్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు పాపిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిశిత కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ భూమయ్య కృషి, పట్టుదల, అంకిత భావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. భూమయ్య కళాశాల విద్యార్థులను తన స్వంత పిల్లలుగా భావించేవారన్నారు. ప్రభుత్వ ...

Read More »

సెక్యురిటి ఏజెన్సీలకు అనుమతి తప్పనిసరి

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెక్యురిటి ఏజెన్సీలకు అనుమతి తప్పనిసరి అని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ శనివారం తెలిపారు. సెక్యురిటి ఏజెన్సీ రెగ్యులేషన్‌ యాక్టు 2005, తెలంగాణ ప్రయివేటు సెక్యురిటి ఏజెన్సీ రెగ్యులరేషన్‌ రూల్స్‌ 2008 ప్రకారం అనుమతులు లేకుండా సెక్యురిటి ఏజెన్సీలు నడపరాదని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈమధ్యకాలంలో సెక్యురిటి ఏజెన్సీలు, కంపెనీల మధ్య సరైన అవగాహన లేకపోవడం మూలాన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎవరైనా ...

Read More »

మ్యాక్సుక్యూర్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మ్యాక్సుక్యూర్‌ ఆసుపత్రి వారు శనివారం ఆంధ్రాబ్యాంకు పెద్దబజార్‌ బ్రాంచ్‌లో సిబ్బందికి, ఖాతాదారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆసుపత్రి వైద్యులు సల్మాన్‌ పాల్గొని సుమారు 150 మందికి వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం వ్యాయామం, నడక, తీసుకునే ఆహార అలవాట్లలో మార్పుల ద్వారా బిపి, షుగర్‌, వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్నందున సద్వినియోగం ...

Read More »

తుంబే ఆసుపత్రిలో అరుదైన చికిత్స

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌లోగల తుంబే ఆసుపత్రిలో అరుదైన చికిత్స చేసినట్టు ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ కృష్ణచైతన్య తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ బాలుడికి కడుపులో కంతి ఏర్పడిందని, గత కొన్నిరోజులుగా ఎన్నో ఆసుపత్రుల్లో పరీక్షించినా ఎవరు తమ వల్ల కాదన్నారని తెలిపారు. చివరికి తుంబే ఆసుపత్రిలో సంప్రదించగా బాలునికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా కడుపులో కంతిని గుర్తించారని అరుదైన చికిత్స ద్వారా కడుపులోంచి నాలుగున్నర కిలోల కంతిని బయటకు తీశామని ...

Read More »

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంటు ఎన్నికల దృస్ట్యా కోడ్‌ అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ప్రజావాణి కార్యక్రమం రద్దుచేసినట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

Read More »

తొలిరోజు పదిపరీక్ష ప్రశాంతం

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ప్రారంభమైన పదవతరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తెలుగు పేపర్‌-1 జిల్లాలో 12,803 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 12,754 మంది హాజరయ్యారు. 49 మంది గైర్హాజరైనట్టు విద్యాశాఖాదికారి రాజు తెలిపారు. ఆయనతోపాటు 21 మంది ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ బృందాలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని వివరించారు.

Read More »

దేశీ దారు స్వాధీనం

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపెట్‌ మండల కేంద్రంలో మండి మార్కెట్లో శనివారం ఎక్సైజ్‌ ఎన్‌పోర్సుమెంట్‌ అధికారులు దాడులు నిర్వహించి అక్రమంగా మహారాష్ట్రకు చెందిన దేశీదారు విక్రయాలు నిర్వహిస్తున్న అలీని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుండి 24 దేశీదారు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎన్‌ఫోర్సుమెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ అనంతయ్య, జగన్‌ మోహన్‌, ఏస్‌ఐలు రాజన్న, శ్రీనుప్రసాద్‌, హెడ్‌ కానిస్టేబుల్‌లు ఉత్తమ్‌, ఆశన్న, శివకుమార్‌, అవినాష్‌ పాల్గొన్నారు.

Read More »

సంక్షేమ ఫలాలు ప్రజలకు చేర్చడం లో పార్టీనే కీలకం – ఎంపి కవిత

నిజామాబాద్‌ ప్రతినిధి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివద్ది కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా చూడడం, గ్రామాల సమగ్రాభివద్ది, పార్టీ పటిష్టతపై నిజామాబాద్‌ ఎంపి దష్టి సారించారు. శనివారం ఆర్మూర్‌, బాల్కొండ నియోజక వర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులతో ఎంపి కవిత మండలాల వారీగా సమావేశమయ్యారు. ఉదయం ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసంలో, సాయంత్రం వేల్పూరులో రోడ్లు, భవనాలు, రవాణా శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నివాసంలో సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ ...

Read More »

పది పరీక్షలో ఒకరు గైర్హాజరు

రెంజల్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం కాగా మొదటి రోజు ఒక విద్యార్థి పరీక్షకు గైర్హాజరైనట్లు ఎంఇఓ గణేష్‌ రావు తెలిపారు. మండలంలో మొత్తం 476 మంది విద్యార్థులకుగాను శనివారం నిర్వహించిన తెలుగు మొదటి పేపర్‌కు 475 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. మొదటి రోజు పరీక్షలు కావడంతో స్క్వాడ్‌లు తనిఖీలు చేపట్టి విద్యార్థులను పరీక్ష సెంటర్లకు పంపించారు. ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Read More »

ఉరివేసుకుని వ్యక్తి మతి

రెంజల్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటా పూర్‌ గ్రామానికి చెందిన లాలి లింగం (42) అనే వ్యక్తి గ్రామ శివారులోని పంట పొలంలో చెట్టుకు ఉరివేసుకొని మతి చెందినట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. లాలి లింగం మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడేవారని శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవ పడి వెళ్లి పంట పొలంలో చెట్టుకు ఉరివేసుకొని మతి చెందినట్లు తెలిపారు. తండ్రి గంగారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ...

Read More »

దేశభక్తిని చాటిచెప్పిన పవిత్ర యుద్దం

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర యుద్దం లఘుచిత్రం దేశభక్తిని చాటిచెప్పిందని ప్రముఖ నిర్మాత భాస్కర్‌ ఐతే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మాణిక్‌ భవన్‌ పాఠశాలలో పవిత్రయుద్దం సక్సెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ పవిత్రయుద్దం చిత్రాన్ని దర్శకులు రవిశ్రీ అద్భుతంగా తెరకెక్కించారని, అంతేకాకుండా స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పిస్తు వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని కొనియాడారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మాణిక్‌ భవన్‌ పాఠశాల ప్రాంగణంలో మొదటి లఘుచిత్రం సక్సెస్‌ మీట్‌ జరగడం ...

Read More »

జస్టిస్‌ ఎస్‌.వి.రమణను మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు విచ్చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎస్‌.వి.రమణను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో న్యాయమూర్తిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టర్‌తో పాటు జిల్లా జడ్జి సుజన, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలిశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Read More »

గ్రంథాలయం ఫేస్‌బుక్‌ పేజీ ప్రారంభం

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయ ఫేస్‌బుక్‌ పేజీని గ్రంథాలయ కార్యదర్శి బుగ్గారెడ్డి శనివారం ఆవిష్కరించారు. డిజిటల్‌ ఎంపవర్‌మెంట్‌ ఫౌండేషన్‌ వారు గ్రంథాలయ అభివృద్దికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గ్రంథాలయం గురించి అన్ని వర్గాల ప్రజలకు తెలపడానికి సోషల్‌ మీడియా అనుసంధానం చాలా మంచి విషయమన్నారు. పాఠకులందరు గ్రంథాలయానికి సంబంధించిన విశేషాలను ఫేస్‌బుక్‌లో తెలుసుకోవచ్చన్నారు. రీజినల్‌ మేనేజర్‌ మణికంఠ మాట్లాడుతూ ఇలాంటి నూతన ఆలోచనల ద్వారా గ్రంథాలయ అభివృద్ది జరుగుతుందన్నారు. ...

Read More »