Breaking News
ఆంధ్రబ్యాంకులో వైద్య శిబిరం నిర్వహిస్తున్న వైద్యులు

మ్యాక్సుక్యూర్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

నిజామాబాద్‌, మార్చ్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మ్యాక్సుక్యూర్‌ ఆసుపత్రి వారు శనివారం ఆంధ్రాబ్యాంకు పెద్దబజార్‌ బ్రాంచ్‌లో సిబ్బందికి, ఖాతాదారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఆసుపత్రి వైద్యులు సల్మాన్‌ పాల్గొని సుమారు 150 మందికి వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం వ్యాయామం, నడక, తీసుకునే ఆహార అలవాట్లలో మార్పుల ద్వారా బిపి, షుగర్‌, వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిబిరంలో మేనేజర్‌ అప్పారావు, ఆసుపత్రి మేనేజర్‌ సురేశ్‌బాబు, కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సొంతింటి (కల) గానే మిగిలిపోయింది…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఆశపెట్టి ...

Comment on the article