Breaking News

సెక్యురిటి ఏజెన్సీలకు అనుమతి తప్పనిసరి

నిజామాబాద్‌, మార్చ్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెక్యురిటి ఏజెన్సీలకు అనుమతి తప్పనిసరి అని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ శనివారం తెలిపారు. సెక్యురిటి ఏజెన్సీ రెగ్యులేషన్‌ యాక్టు 2005, తెలంగాణ ప్రయివేటు సెక్యురిటి ఏజెన్సీ రెగ్యులరేషన్‌ రూల్స్‌ 2008 ప్రకారం అనుమతులు లేకుండా సెక్యురిటి ఏజెన్సీలు నడపరాదని, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈమధ్యకాలంలో సెక్యురిటి ఏజెన్సీలు, కంపెనీల మధ్య సరైన అవగాహన లేకపోవడం మూలాన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎవరైనా ఇన్సిట్యూషన్స్‌, ఎస్టాబ్లిష్‌మెంట్లు, ఆర్గనైజేషన్‌లు, ప్రయివేటు సెక్యురిటి సిబ్బందిని నియమించుకోవాలనుకుంటే వారు సంబందిత ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాతే ఏజెన్సీ ప్రారంభించాలని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై క్రిమినల్‌ చర్యలు తప్పవని కమీషనర్‌ హెచ్చరించారు.

The following two tabs change content below.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *