Breaking News

ఆలయంలో దొంగ…

నిజామాబాద్‌, మార్చ్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోగల కేశాపూర్‌ గ్రామంలో మహాలక్ష్మి ఆలయంలో హుండి చోరీచేస్తున్న వ్యక్తిని ఆలయ సమీపంలోగల అగ్రిగోల్డ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ గుర్తించి అదే సంస్థలో పనిచేస్తున్న గంగారెడ్డికి విషయం తెలియజేశాడు. ఇద్దరు కలిసి ఆలయంవైపు వెళ్లిచూడగా వీరిని గమనించిన దొంగ పారిపోయాడు. అతన్ని వెంబడించి పట్టుకొని విచారించగా అతడు కామారెడ్డి జిల్లా రాజంపేట్‌ మండలం ఎల్లారెడ్డిపల్లి తాండాకు చెందిన లంబాడి ప్రశాంత్‌గా గుర్తించారు. ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడిన ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని రూ. 3600 నగదు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్టు రూరల్‌ ఎస్‌హెచ్‌వో ప్రభాకర్‌ తెలిపారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *