Breaking News

Daily Archives: March 20, 2019

విరాళం ఇస్తాం…ఓటేస్తాం…

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపిగా రెండోసారి పోటీ చేస్తున్న ఎంపి కల్వకుంట్ల కవితకు నిజామాబాద్‌ జిల్లాలోని పలు కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎన్నికల ప్రచార ఖర్చులకు తమవంతు ఆర్థిక సాయం చేసేందుకు విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని చెక్‌ రూపంలో ఎంపి కవితకు అందజేశారు. బుధవారం ఎంపి ఆఫీస్‌లో కవితని కలిసిన సంఘాల నేతలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తాము సేకరించిన విరాళాల మొత్తం రూ. 4 లక్షల 47 వేల948 ను ...

Read More »

మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించండి

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్తిగా మోహన్‌రెడ్డిని గెలిపించాలని తెలంగాణ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘం ప్రతినిధులు కోరారు. సోమవారం స్తానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బట్టాపూర్‌ మోహన్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, మోహన్‌రెడ్డి పిఆర్‌టియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా సుమారు 25 సంవత్సరాలు పనిచేసి ఎమ్మెల్సీగా ఆరుసంవత్సరాలుగా సేవలందించారన్నారు. ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించని సందర్భంలో దర్నాలు, పికెటింగ్‌లు, ముట్టడి సమ్మె ...

Read More »

మ్యాక్సుక్యూర్‌ ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన మ్యాక్సుక్యూర్‌ ఆసుపత్రి ఆద్వర్యంలో బుధవారం బజాజ్‌ అలయన్స్‌ జనరల్‌ ఇన్సురెన్సు కంపెనీ సౌజన్యంతో స్థానిక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. శిబిరాన్ని బ్యాంకు మేనేజర్‌ రాంరెడ్డి ప్రారంభించారు. శిబిరంలో బ్యాంకు సిబ్బందికి, ఖాతాదారులకు బిపి, డయాబెటిక్‌, ఇసిజి పరీక్షలు నిర్వహించి పలు వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది. శిబిరంలో సుమారు వందమందికి పైగా వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రి ...

Read More »

చిన్నమల్లారెడ్డిలో పోలీసుల కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక, పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో బుధవారం పోలీసులు, సిఐఎస్‌ఎప్‌ ప్లాటోన్‌ బృందం కవాతు నిర్వహించారు. గ్రామంలోని ప్రదాన వీధుల గుండా కవాతు జరిపారు. ఎన్నికల దృష్ట్యా డిఎస్‌పి ఉదయ్‌రెడ్డి ఆద్వర్యంలో కవాతు నిర్వహించినట్టు తెలిపారు.

Read More »

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డిలో బుధవారం స్థానిక మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మను సన్మానించారు. మహిళలు హక్కులు, చట్టాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ మహిళలు కేవలం వంటగదికే పరిమితం కాకుండా ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. మగవారితో సమానంగా అన్నింట్లో ముందుండాలని చెప్పారు. రాజ్యాంగంలో ఉన్న చట్టాలు, హక్కుల గురించి తెలుసుకొని ముందుకు సాగాలన్నారు. మహిళా ఉత్సవాలు నిర్వహించిన ...

Read More »

వెబ్‌కాస్టింగ్‌పై విద్యార్తులకు ఇచ్చిన సూచనలు అమలు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న జరగనున్న శాసనమండలి, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో వెబ్‌కాస్టింగ్‌లో పాల్గొనే విద్యార్థులు తమకు సూచించిన సూచనలు తప్పనిసరిగా అమలు చేయాలని, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రె విద్యార్థులకు సూచించారు. కామారెడ్డి ఆర్‌కె డిగ్రీ కళాశాలలో బుధవారం విద్యార్థులకు నిర్వహించిన వెబ్‌కాస్టింగ్‌ ప్రజంటేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వెబ్‌కాస్టింగ్‌ నిర్వహణలో విద్యార్థులు ఎటువంటి తప్పులు గ్రహించినా వాటిని ప్రీసైడింగ్‌, మైక్రో అబ్జర్వర్లకు సూచించాలన్నారు. పోలింగ్‌ కేంద్రం కవరేజ్‌ అయ్యేలా విద్యార్థులు ...

Read More »

వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి చెల్లింపులు పూర్తిచేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల31లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసుకొని సంబందిత చెల్లింపులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మండలాభివృద్ది అదికారులు, ఇవో పంచాయతీరాజ్‌, ఏపివో, టెక్నికల్‌ అసిస్టెంట్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఉపాధి హామీ పనుల లక్ష్యాలు, ఫలితాలు, వ్యక్తిగత మరుగుదొడ్లపై సమీక్షించారు. ఇప్పటి వరకు 70 లక్షల, 33 వేల పని దినాలు పూర్తిచేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతిరోజు అందరికి పనికల్పించేలా చూడాలని ఆదేశించారు. ఉపాధి హామీలో భాగంగా ...

Read More »

పిఎం మోడి వల్లే పెద్దపల్లి, నిజామాబాద్‌ రైల్వే లైన్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఎం నరేంద్ర మోడివల్లే పెద్దపల్లి, నిజామాబాద్‌ రైల్వే లైను ఏర్పడిందని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న నిజామాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ఎంపి కవిత మాట్లాడుతూ తనవల్లే నిజామాబాద్‌, పెద్దపల్లి రైల్వే లైను పూర్తయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 40 సంవత్సరాలుగా ...

Read More »

మదుయాష్కీకి తెలంగాణ జనసమితి మద్దతు

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుగౌడ్‌ యాష్కీకి మద్దతుగా నిజామాబాద్‌లో పోటీనుండి తప్పుకుంటున్నట్టు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌ జనసమితి ప్రధాన కార్యాలయంలో మధుయాష్కీ, కోదండరాంతోపాటు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మధుగౌడ్‌ అప్పీలు మేరకు నిజామాబాద్‌ పోటీనుంచి విరమించుకుంటున్నట్టు కోదండరాం వెల్లడించారు. మధుయాష్కీకి మద్దతుగా జనసమితి ప్రచార పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. తెలంగాణ సాధించడంలో రాజీలేని పోరు చేసిన మదుయాష్కీ గెలుపు ...

Read More »

జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు బుధవారం హోళీ శుభాకాంక్షలు తెలిపారు. బందుమిత్రులతో ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకోవాలని, వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా జరుపుకునే హోలీ పండగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. రసాయనాలు లేని రంగులు ఉపయోగించాలని, చెడుపై విజయమే హోలీ పండగ ఉద్దేశమని, కామదహనం అనంతరం జరుపుకునే ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ...

Read More »

మూడోరోజు ఏడు నామినేషన్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడోరోజు నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి ఏడు నామినేషన్లు దాఖలైనట్టు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నామినేషన్‌ దాఖలు చేసినవారిలో నిజామాబాద్‌ నగరానికి చెందిన రాపెల్లి శ్రీనివాస్‌, మోర్తాడ్‌ మండల కేంద్రానికి చిన్న గంగారాం, మోర్తాడ్‌ మండల కేంద్రానికి చెందిన మల్లేశ్‌, జగిత్యాల జిల్లా కల్లెడకు చెందిన తిరుపతి, సారంగాపూర్‌కు చెందిన నోముల గోపాల్‌రెడ్డి, జగిత్యాలకు చెందిన తిరుపతి, ఆర్మూర్‌కు చెందిన పోల వెంకటేశ్‌ నామినేషన్లు ...

Read More »

సిఎం కెసిఆర్‌ విజన్‌ దేశానికి దిక్సూచి : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత బుధవారం సాయంత్రం మెట్‌పల్లిలో కోరుట్ల నియోజక వర్గం టిఆర్‌ఎస్‌ నాయకులతో సమావేశమయ్యారు. కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేతో కలిసి మండలాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధారంగా గ్రామ నాయకుల పనితీరును విశ్లేషించారు. కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లోని గ్రామాల అవసరాలను అడిగి తెలుసుకుంటూ, పరిష్కారం కోసం సూచనలు చేశారు. కోరుట్ల, మెట్‌ పల్లి టౌన్‌ లపై ...

Read More »

అలరించిన కుస్తీ పోటీలు

రెంజల్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి, రెంజల్‌, సాటాపూర్‌ గ్రామాలలో బుధవారం హోలీ పండుగను పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మల్లయోధులు కుస్తీ పోటీలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు ఆనవాయితీగా నిర్వహిస్తారు. పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సాయరెడ్డి, రమేష్‌, వికార్‌ పాషా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా హోలీ సంబరాలు

రెంజల్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌, దూపల్లి, సాటాపూర్‌ గ్రామాలలో బుధవారం ఘనంగా హోలీ పండుగను నిర్వహించారు. మంగళవారం రాత్రి కామదహనం చేసి ఉదయం హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు సంతోషాల మధ్య రంగులు చల్లుకుని హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

Read More »

దూపల్లి నర్సరీని సందర్శించిన ప్రాజెక్టు డైరెక్టర్‌

రెంజల్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దూపల్లి గ్రామంలోని ఉపాధి హామీ నర్సరీ ని బుధవారం డ్వామా పిడి రమేష్‌ రాథోడ్‌ ఆకస్మికంగా సందర్శించారు. నర్సరీలోని మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని సూచించారు. మండలంలో అన్ని నర్సరీలలో మొక్కల సంరక్షించే బాధ్యత అధికారులదేనని ప్రతి మొక్కను కాపాడుకునే బాధ్యత తమ పైనే ఉందని అన్నారు. ఎప్పటికప్పుడు నర్సరీలను సందర్శించాలని ఎంపీడీవో చంద్రశేఖర్‌కు సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ సాయరెడ్డి, ఈసి శరత్‌ చంద్ర, కార్యదర్శి యాదగిరి ఉన్నారు.

Read More »

తెరాసలోకి తెదేపా, కాంగ్రెస్‌ నాయకులు

నిజామాబాద్‌ మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. బుధవారం నిజామాబాద్‌ లిమ్రా ఫంక్షన్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన వక్ఫ్‌ బోర్డ్‌ మాజీ చైర్మన్‌ ఫయాజ్‌, టిడిపి నగర అధ్యక్షుడు బాల కిషన్‌, జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు పాపా ఖాన్‌ సాహెబ్‌, సేవాదళ్‌ సిటీ ప్రెసిడెంట్‌ అమర్‌, మాజీ వక్ఫ్‌ బోర్డ్‌ ఉపాధ్యక్షుడు చాంద్‌, టిడిపి అనుబంధ విద్యార్థి విభాగం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ...

Read More »

చలివేంద్రం ప్రారంభం

నిజాంసాగర్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ పట్టణ కేంద్రంలో సువర్ణ ధియేటర్‌ రోడ్‌ లో గల ఆర్‌.కే మొబైల్‌ షాప్‌ ఎదుట బుధవారం నారాయణ్‌ ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి చలవేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు విజయ్‌ బుజ్జి తెలిపారు. ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజల దాహాన్ని తీర్చేదుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది మంచి ఆలోచన అని, ఇటువంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయడం గొప్పవిషయమేనన్నారు. ...

Read More »

21న కవిత్వ కార్యశాల

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో గురువారం 21 వతేదీన కవిత్వ కార్యశాల ఉంటుందని తెరవే ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక కర్షక్‌ బిఇడి కళాశాలలో ప్రపంచ కవిత్వ దినోత్సవం, ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా కవిత్వ కార్యశాల, సామాజిక సమస్యలపై కవితాగానాలు ఉంటాయని పేర్కొన్నారు. కవిత్వం అంశంపై కవి గఫర్‌ శిక్షక్‌ ప్రసంగిస్తారని, కవిసమ్మేళనం ఎన్నీల ముచ్చట్లకు విచ్చేసే కవులు రెండు కవితలను చదవాలని కోరారు. సాయంత్రం 6 ...

Read More »

బతుకు భారం కాదు…

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుఖం విలువ తెలుస్తుంది శోకం పైబడితేనే అంటారు సినారె… బతుకు విలువ తెలుస్తుంది భారం పైబడితేనే అనిపిస్తుంది పైచిత్రాన్ని చూస్తుంటే… చిన్న వాహనం, దానిపై 40 వరకు కుర్చీలు, సాపలు, వాటిపై తన భార్య యజమానికి భారం అనిపించట్లేదు కదూ… అదే జీవితమంటే… (సామాజిక ప్రసార మాధ్యమంలో కనిపించిన చిత్రం) బతుకు భారాన్ని ఆనందంగా మోస్తున్న వీరికి నిజామాబాద్‌ న్యూస్‌ హ్యాట్సాఫ్‌.

Read More »

21న వసంత కవితోత్సవం

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రచయితల సంఘం కామారెడ్డి ఆద్వర్యంలో 21వ తేదీ అంతర్జాతీయ కవితా దినోత్సవం రోజున వసంత కవితోత్సవం (కవి సమ్మేళనం) నిర్వహిస్తున్నట్టు సంఘం ప్రతినిదులు ఒక ప్రకటనలో తెలిపారు. 21న సాయంత్రం 5 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాశివనంలో కవి సమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.శంకర్‌, ఆత్మీయ అతుథులుగా తెరసం రాష్టకార్యదర్శి సి.హెచ్‌. ప్రకాశ్‌, తెరసం రాష్ట్రకార్యవర్గసభ్యులు మోతుకూరి ...

Read More »