Breaking News

మదుయాష్కీకి తెలంగాణ జనసమితి మద్దతు

నిజామాబాద్‌, మార్చ్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి మధుగౌడ్‌ యాష్కీకి మద్దతుగా నిజామాబాద్‌లో పోటీనుండి తప్పుకుంటున్నట్టు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌ జనసమితి ప్రధాన కార్యాలయంలో మధుయాష్కీ, కోదండరాంతోపాటు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మధుగౌడ్‌ అప్పీలు మేరకు నిజామాబాద్‌ పోటీనుంచి విరమించుకుంటున్నట్టు కోదండరాం వెల్లడించారు. మధుయాష్కీకి మద్దతుగా జనసమితి ప్రచార పాదయాత్ర చేపడుతున్నట్టు తెలిపారు.

తెలంగాణ సాధించడంలో రాజీలేని పోరు చేసిన మదుయాష్కీ గెలుపు చారిత్రక అవసరమని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణతోపాటు జాతీయస్థాయి రాజకీయాలు ఎన్నికల సమీకరణలు, ఇతర అంశాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఎర్రజొన్న, పసుపు రైతులను నిలువుదోపిడి చేస్తున్న వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం మమకారం చూపుతుందని కోదండరాం, మధుయాష్కీ ఆరోపించారు. రైతులపై ఉక్కుపాదం మోపి భయానక పరిస్థితిని ప్రభుత్వం సృష్టించడం దారుణమని వారు ఆరోపించారు. ఈ భేటీలో తెలంగాణ జనసమితి ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ విశ్వేశ్వరయ్య, ముఖ్యనేతలు రమేశ్‌, శ్రీనివాస్‌, నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *