Daily Archives: March 21, 2019

శుక్రవారం నామినేషన్‌ వేయనున్న ఎంపి కవిత

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిజామాబాద్‌ కలెక్టరేట్లో నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఉదయం 10 గంటలకు సారంగాపూర్‌ హనుమాన్‌ దేవాలయంలో ఎంపి కవిత ప్రత్యేక పూజలు చేస్తారని, అక్కడి నుండి నేరుగా నామినేషన్‌ వేసేందుకు నిజామాబాద్‌ విచ్చేస్తారన్నారు. అదేరోజు సాయంత్రం 6:30 గంటలకు మాక్లూర్‌ మండలం మాణిక్‌ భండార్‌లో రోడ్‌షో తో ఎంపి కవిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారన్నారు. డిచ్‌పల్లిలో ...

Read More »

తెరాస లోక్‌సభ అభ్యర్థులు వీరే..

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ అభ్యర్థులను ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం ఖరారు చేశారు. కరీంనగర్‌ : బోయినపల్లి వినోద్‌ కుమార్‌ పెద్దపల్లి : బోర్లకుంట వెంకటేష్‌ నేతకాని ఆదిలాబాద్‌ : గోడెం నగేష్‌ నిజామాబాద్‌ : కల్వకుంట్ల కవిత జహీరాబాద్‌ : బీ.బీ.పాటిల్‌ మెదక్‌ : కొత్త ప్రభాకర్‌ రెడ్డి వరంగల్‌ : పసునూరి దయాకర్‌ మహబూబాబాద్‌ : మాలోత్‌ కవిత ఖమ్మం : నామ నాగేశ్వరరావు భువనగిరి ...

Read More »

కవి నిత్యచైతన్యశీలి

కామారెడ్డి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలని, కవి నిత్య చైతన్య శీలి అయి, తాను మేల్కొంటూ సామాజిక రుగ్మతలను తొలగించే క్రమంలో కవుల రచనలు ఉండాలని ప్రముఖ గజల్‌ కవి సూరారం శంకర్‌ అన్నారు. గురువారం సాయంత్రం తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కామారెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాలలో జరిగిన ప్రపంచ కవిత్వ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కవిత్వం భావ వ్యక్తీకరణ సాధనమని, రమణీయ భావాల సమాహారమని కలలను సాకారం చేయగలిగేది ...

Read More »

హోళీ వేడుకల్లో డిఐజి, సిపి

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హోళీ పండగ పురస్కరించుకొని నిజామాబాద్‌ డిఐజి కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ డిఐజి శివశంకర్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకొని రంగులు పూశారు. అనంతరం డిఐజి సిపి కార్తికేయకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ సిబ్బందితో పాటు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ళు, హోంగార్డులందరు నృత్యాలు చేస్తు ఘనంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత సిపి కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది సిపి కుటుంబసభ్యులతో హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ...

Read More »

ఒకే పార్లమెంట్‌ పరిధిలో ఉద్యుగులకు ఓటువేసే అవకాశం

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బంది ఓటు అదే పార్లమెంటు పరిధిలో విధులు నిర్వహిస్తే నేరుగా ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ఒక ఉద్యోగి అదే పార్లమెంట్‌ పరిధిలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు కలిగి ఉన్నా సరే తాను విధులు నిర్వహించే పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఎన్నికల ...

Read More »

నీటిని ఆదాచేయాలి

నిజాంసాగర్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్హేర్‌ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా బీబీపేట్‌ సర్పంచ్‌ రవీందర్‌ రెడ్డి, ఉపాధ్యక్ష పదవికి కల్హేర్‌ సర్పంచ్‌ పెరుమాండ్ల లచ్చవ్వ-బాలయ్యను ఎన్నుకొని శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో మన నియోజకవర్గంలో నీటి ఎద్దటి ఉన్నందున ప్రతి గ్రామంలో సర్పంచ్‌లు మిషన్‌ భగీరథ ద్వార గాని, బోరుబావుల ద్వార గాని నీటి సదుపాయం చేసే అవకాశముంటే సంబంధిత శాఖల సమన్వయంతో ప్రజలకు ...

Read More »

బాధిత కుటుంబానికి రైతుబీమా సాయం

నిజాంసాగర్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని ర్యాకల గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త బోయిని విట్టల్‌ అనారోగ్యంతో మరణించినందున వారి కుటుంబీకులకు అన్ని విధాల తానై ఆదుకుంటామని శాసన సభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి బరోసా ఇచ్చారు. తెరాస ప్రభుత్వం రైతు భీమా పథకం ద్వార అందించే రూ. 5 లక్షలను వారి బ్యాంకు ఖాతాలో జమచేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్సు కమిటీ మెంబర్‌ రాథోడ్‌ రవీందర్‌ నాయక్‌ గారు పాల్గొన్నారు.

Read More »

మానవత సాధన్‌లో హోళీ వేడుకలు

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హోళి పండుగ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు డిచ్‌పల్లి మానవతా సదన్‌ అనాధ పిల్లలతో సతీసమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. వారితో కలిసి రంగులు చల్లుకోవడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్‌ పేర్కొన్నారు. పిల్లలతో రంగులు చల్లించుకొని వారికి కూడా కలెక్టర్‌ దంపతులు రంగులు పోశారు. పిల్లలకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. కొంత సమయం వారితో ఆహ్లాద వాతావరణంలో గడిపారు. వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు దేవుడితో సమానం ...

Read More »

బీర్కూర్‌లో ఘనంగా హొలీ వేడుకలు

బీర్కూర్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలో గురువారం ఘనంగా హొలీ వేడుకలు జరుపుకున్నారు. బుదవారం రాత్రి అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో బీర్కూర్‌ ఘడి వద్ద కామ దహనం నిర్వహించారు. విఆర్వో, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామపెద్దలు కామదహన కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ చౌక్‌ హనుమాన్‌ ఆలయం వద్ద 100 కిలోల గుండు రాయిని ఎత్తుకుని తమ సత్తా ప్రదర్శించారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, భాజా బజంత్రీలతో గ్రామంలో ర్యాలీ ...

Read More »

ఆర్‌.కె.డిగ్రీ కళాశాల జయకేతనం

కామారెడ్డి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బుధవారం విడుదలచేసిన సెమిస్టర్‌ ఫలితాలలో ఆర్‌.కె. డిగ్రీ కళాశాల విద్యార్థులు టాపర్లుగా నిలిచినట్టు ఆర్‌.కె.కళాశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. టి.యశస్విని 10/10 జిపిఎ, వి.సౌమ్య 10/10 జిపిఎతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచారని, సాగరిక 9.86, దివ్య 9.85, దివ్యశ్రీ 9.82, శ్రీపాధవి 9.79, హారిక 9.78, లక్ష్మిమాధురి 9.63, కల్పన 9.63, దేవరాని 9.63, సన 9.63 జిపిఎలతో యూనివర్సిటీ స్థాయిలో జయకేతనం ఎగురవేశారన్నారు. వీరితోపాటు 150 ...

Read More »

24న సంగీత, నృత్యపాఠశాల వార్షికోత్సవం

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీజ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల, నిజామాబాద్‌ వారి 47వ వార్షికోత్సవం ఈనెల 24న ఆదివారం నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ డి.ప్రశాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సాయంత్రం 5.30 గంటలకు వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని అన్నారు. ముఖ్య అతిథిగా భాషా సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, గౌరవ అతిథిగా సెషన్స్‌ జడ్జి కె.సుజన, ఆత్మీయ అతిథులుగా 7వ పటాలము కమాండెంట్‌ ఎస్‌.వి.సాంబయ్య, నిజామాబాద్‌ నగరపాలక సంస్థ కమీషనర్‌ ...

Read More »