Breaking News

Daily Archives: March 22, 2019

ఢిల్లీలో గులాబి దండుతోనే హక్కుల సాధన : ఎంపి కవిత

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత మాక్లూర్‌ మండలం మాణిక్‌ భండార్‌లో రోడ్‌షోతో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం సారంగాపూర్‌ హనుమంతున్ని దర్శించుకుని నామినేషన్‌ పత్రాలను అంజన్న పాదాల చెంత పెట్టీ మొక్కుకున్నారు. అత్తామామలు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుని నిజామాబాద్‌ కలెక్టరేట్‌కు అంబాసిడర్‌ కారులో వెళ్లారు. ఆ కారును నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా నడిపారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి కూడా కారులో వెళ్లారు. మధ్యాహ్నం కలెక్టరేట్‌లో ...

Read More »

యుగనినాద స్ఫూర్తి గేయమే జలరక్షణ

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నీరు, నీటి పొదుపు ఆవశ్యకతపై రచించిన పాటల పుస్తకం జలం, జీవం, జీవనం పుస్త సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత గఫూర్‌ శిక్షక్‌ రచించిన పుస్తకంలో నీటి పొదుపు ఆవశ్యకత నేడు ఎంత అవసరమో పాటలల్లో తెలియజేశారన్నారు. శుక్రవారం ప్రముఖ కవి పీతాంబర్‌ నివాసంలో కార్యక్రమం నిర్వహించారు. నీటి సంరక్షణ అందరి బాధ్యతగా భావించాలని ముఖ్య అతిథి ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్తానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, పలువురు ప్రముఖులు శుక్రవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్‌ ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు. ఏర్పాట్లపై ఆరాతీశారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రెతో కలిసి ఎన్నికల సరళిని పరిశీలించారు. తెరాస మైనార్టీ శాఖ అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, పట్టభద్రుల అభ్యర్తి రణజిత్‌మోహన్‌, నాయకులు కృష్ణగౌడ్‌, పిప్పిరి వెంకటి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఓటు హక్కు ...

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ర్యాండమైజేషన్‌ పూర్తి

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ర్యాండమైజేషన్‌ పూర్తిచేసి అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం 05జహీరాబాద్‌ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఏఎంసి గోదాములో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వివిద రాజకీయపార్టీల నాయకుల సమక్షంలో నిర్వహించిన ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల మొదటి ర్యాండమైజేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని నియోజకవర్గాలు కలిపి మొత్తం 789 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, యంత్రాలను ...

Read More »

పోలీసుల కవాతు

రెంజల్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ముందస్తుగా ఎటువంటి అల్లర్లు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు మండలంలోని సాటాపూర్‌, నీలా, కందకుర్తి గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. గ్రామాల్లోని వివిధ వీధుల గుండా కవాతు కొనసాగింది. అనంతరం బోధన్‌ రూరల్‌ సిఐ షాకీర్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల దష్ట్యా గ్రామాల్లో ఎటువంటి గొడవలు సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు. ఎటువంటి అల్లర్లకు పాల్పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై ...

Read More »

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

రెంజల్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌, నిజామాబాద్‌, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం మండల కేంద్రంలో ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకుకు ప్రశాంతంగా జరిగాయి. మండలంలో పట్టభద్రులు 232 ఓటర్లు ఉండగా 154 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు 86 మంది ఉండగా 77 మంది ఉపాధ్యాయులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మండలంలో మొత్తం పట్టభద్రుల పోలింగ్‌ శాతం 69%, ఉపాధ్యాయుల పోలింగ్‌ శాతం 90% పూర్తయినట్లు అధికారులు ...

Read More »

పట్టభద్రుల ఎన్నికల్లో 88.24 శాతం ఓటింగ్‌

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలో 88.24 శాతం ఓటింగ్‌ నమోదైనట్టు అధికారులు తెలిపారు. పట్టభద్రులు 64.85 శాతం, ఉపాధ్యాయులు 88.24 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా బీబీపేట మండలంలో 93.33 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా, అత్యల్పంగా రామారెడ్డి మండలంలో 80 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా ఎన్నికలు అధికారుల ఏర్పాట్లు, పోలిసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా జరిగింది.

Read More »

అంజన్నను దర్శికుంచుకున్న ఎంపీ కవిత

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, భర్త అనిల్‌రావ్‌తో కలసి శుక్రవారం సారంగాపూర్‌ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. నిజామాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా నామినేషన్‌ వేసే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్‌ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, టిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాంకిషన్‌ రావు, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జడ్పీ వైస్‌చైర్‌ పర్సన్‌ సుమనారెడ్డి, నాయకులు ఈగ గంగారెడ్డి, ...

Read More »

రెండుసెట్లు నామినేషన్‌ దాఖలు చేసిన ఎంపి కవిత

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత శుక్రవారం మధ్యాహ్నం రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. తాను ఎంపిగా జిల్లా, రాష్ట్ర అంశాలన్నింటినీ పార్లమెంట్‌ లో ప్రస్తావించానని, హైకోర్టు విభజన, మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎట్లా కొట్లాడామో ప్రజలు చూశారని పేర్కొన్నారు. ఐదేళ్లలో తన పనితీరుకు మెచ్చి పార్టీ అధిష్టానం మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించిందని, వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న… మరో ...

Read More »

నీటితోనే మానవ మనుగడ

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీరు ఉంటేనే మానవ మనుగడ సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. మార్చి 22న 26వ ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఆద్వర్యంలో స్తానిక రాశివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా అధికారులు, విద్యార్థులతో జలాలను దుర్వినియోగం చేయం, జలవనరుల అభివృద్దికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడారు. నీరు ప్రాణికోటికి ప్రాణాధారమని, జలాలను రక్షించడమే గాకుండా పొదుపుగా ...

Read More »

అంగన్‌వాడిలో పోషన్‌ అభియాన్‌

నిజాంసాగర్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం నర్సింగ్‌రావుపల్లి గ్రామములో అంగన్‌వాడీ టీచర్‌ లక్ష్మీ, మంజుల శుక్రవారం పోషణా అబియణ్‌ కార్య క్రమం నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రంలో గ్రామ సంబంధిత కార్యక్రమాలు, అన్నప్రాసనలు, సాముహిక శ్రీమంతాలు, అక్షరాభ్యాసం కార్యక్రమలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, తల్లులు, పర్యవేక్షణ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

Read More »

మధుయాష్కీ తరుపున నామినేషన్‌ దాఖలు

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మధుయాష్కి గౌడ్‌ తరుపున శుక్రవారం ఒక సెట్‌ నామినేషన్‌ను అతని సన్నిహితులు దాఖలు చేసారు. నామినేషన్‌ దాఖలు చేసినవారిలో కాంగ్రెస్‌ నాయకులు దయాకర్‌ గౌడ్‌, తాటికొండ శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.

Read More »

ఎంపీ కవిత గెలుపు కోసం శివాలయంలో పూజలు

రెంజల్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని శివాలయంలో శుక్రవారం బోధన్‌ మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో గెలుపొందాలని శివాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ అభ్యర్థిగా కవితను భారీ మెజార్టీతో గెలిపించి నిజామాబాద్‌ జిల్లాను మరింత అభివద్ధి పథంలో ముందుకు సాగేందుకు ప్రతి కార్యకర్త కషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌, ...

Read More »

నైతిక విలువలకు పాతరేస్తున్న కెసిఆర్‌

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రిగా ఉండి కెసిఆర్‌ నైతిక విలువలను పాతరేస్తున్నారని కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ మహ్మద్‌ అలీ షబ్బీర్‌ విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నికల కోడ్‌ను పూర్తిగా విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం 17 మంది ఎంపి అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఇతర పార్టీల నుంచి నలుగురిని క్యాంపు కార్యాలయంలో తెరాసలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ చేరికలు పెట్టుకోవడానికి అది ...

Read More »

నేడు అర్వింద్‌ ధర్మపురి నామినేషన్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అర్వింద్‌ ధర్మపురి నిరాడంబరంగా నామినేషన్‌ దాఖలు చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 9.15 గంటలకు సారంగపూర్‌ హనుమాన్‌ మందిరంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులు, మీడియాతో మాట్లాడుతారు. అలాగే ఈ నెల 25న మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ ...

Read More »