Daily Archives: March 23, 2019

16 ఎంపీలను ఇస్తే కెసిఆర్‌ 116 చేస్తారు

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16 మంది టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 116 మంది ఎంపీలను కూడగడతారని నిజామాబాద్‌ ఎంపి కవిత చెప్పారు. దేశాభివద్ధికి దార్శనికత, జవాబుదారీతనం కలిగిన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరముందన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. శనివారం జగిత్యాల, బాల్కొండ నియోజక వర్గాల్లో రోడ్‌షోలలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్‌ బి.జె.పిలు దేశానికి చేయాల్సిన అభివద్ధిని చేయలేదని విమర్శించారు. మనరాష్ట్రం హక్కులు ...

Read More »

రెంజల్‌లో భగత్‌ సింగ్‌కు ఘన నివాళి

రెంజల్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎస్సి బాలుర వసతి గహంలో శనివారం భగత్‌సింగ్‌ వర్ధంతిని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏబీవీపీ మండల అధ్యక్షుడు గంగాప్రసాద్‌ మాట్లాడుతూ తెల్లదొరల నుంచి భారతదేశానికి బానిస సంకెళ్ళు విడగొట్టే క్రమంలో భారత మాత ముద్దు బిడ్డలకు ఒకేసారి ఉరికంబాని కెక్కించారన్నారు. కార్యక్రమంలో జిల్లాకో కన్వీనర్‌ ...

Read More »

ఎఫ్‌ఎల్‌సిని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి గోదాములో శనివారం ఈవిఎంలు, వీవీప్యాట్‌ యంత్రాల ఎఫ్‌ఎల్‌సి కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డిలు పరిశీలించారు. ఈ పాటికే మొదటి రౌండ్‌ ఎప్‌ఎల్‌సి పూర్తిచేశామని, యంత్రాలను గోదాములో భద్రపరిచామని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసినట్టు తెలిపారు. ఆయా పార్టీల సమక్షంలో ఫస్ట్‌ లెవల్‌ చెకప్‌ పూర్తిచేసి యంత్రాలను భద్రపరిచినట్టు పేర్కొన్నారు.

Read More »

భగత్‌సింగ్‌కు ఘన నివాళి

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతమాత బానిస శృంఖలాలను తెంచేందుకు తమ ప్రాణాలర్పించిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ఏఐఎస్‌ఎప్‌ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని భగత్‌సింగ్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే బ్రిటీష్‌ బానిసత్వం నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు భగత్‌సింగ్‌ ఎనలేని పోరాట పటిమను చూపారన్నారు. ఉరికొయ్యను ముద్దాడి దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎనలేని పాత్ర పోషించారని కొనియాడారు. యువతకు ఆయన ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో దశరథ్‌, ...

Read More »

పట్టణంలో పోలీసు కవాతు

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భద్రత చర్యల దృష్ట్యా శనివారం కామారెడ్డి పట్టణంలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. పట్టణంలోని పలు వార్డుల్లో కవాతు జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు వార్డు వాసులతో మాట్లాడారు. దొంగతనాలు జరగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. అన్ని వీధుల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒకవేళ దొంగతనం జరిగితే దొంగలను పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పోలీసులకు ప్రజల సహకారం అవసరమని చెప్పారు.

Read More »

పది పరీక్ష కేంద్రం పరిశీలన

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ శనివారం ఆకస్మికంగా పర్యవేక్షించారు. పరీక్ష గదుల్లో తిరిగి అక్కడి ఏర్పాట్లను, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం గురికాకుండా సజావుగా పరీక్షలు రాసేలా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.

Read More »

బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం పిడిఎస్‌యు, పివైఎల్‌ నిజామాబాద్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో గన్‌పూర్‌ గ్రామంలో గాంధీవిగ్రహం వద్ద భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డివిజన్‌ అధ్యక్షులు సాయినాథ్‌ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ తన 12 ఏళ్ల వయసు నుంచి దేశం పట్ల అమితమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అని, జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం జరిగిన తర్వాత అక్కడికి వెళ్లి అక్కడ రక్తంతో తడిసిన మట్టి తీసుకొని ఇంటికి వెళ్లి సీసాలో పోసుకుని ...

Read More »

కొత్త పాసుపుస్తకాలివ్వాలి

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం అక్కాపూర్‌, లచ్చపేట, తడకపల్లి, గన్‌పూర్‌ తదితర గ్రామాల్లోని ఎస్సీ, బీసీ పేద ప్రజలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన పాత పుస్తకాల స్థానంలో రెవెన్యూ అధికారులు కొత్త పాసుపుస్తకాల జారీ చేయడం లేదని, జిల్లా కలెక్టర్‌ గతంలో ఉన్న తహసిల్దారు అందరికీ పాస్‌ పుస్తకాలు ఇస్తామని హామీలు ఇచ్చిన నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు తమకు న్యాయం జరగలేదని ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో రెడ్డి మండల తాసిల్దార్‌ నరసింహులుకు వినతి పత్రం ...

Read More »

ఈవిఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్‌ జిల్లాలో ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో 1509 పోలింగ్‌ కేంద్రాలకు గాను బ్యాలెట్‌ యూనిట్లు 2430, కంట్రోల్‌ యూనిట్లు 1815, వి.వి ప్యాట్లు 1958 అందుబాటులో ఉన్నాయని, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు అనుగుణంగా మరో 20 శాతం ఈవీఎంలను కేటాయించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ...

Read More »

కేంద్రంలో మళ్ళీ బీజేపీదే అధికారం:

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తిరిగి బిజెపి కూటమి అధికారంలోకి రావడం ఖాయమని భారతీయ జనతాపార్టీ ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ ధర్మపురి అన్నారు. శుక్రవారం నగర శివారులోని సారంగాపూర్‌ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్‌ రామ్‌మోహన్‌ రావ్‌కు నామినేషన్‌ సమర్పించారు. అనంతరం బిజెపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం క్లిష్ట పరిస్తితులున్నాయని, మోదిని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయన్నారు. ...

Read More »