Breaking News
భగత్‌సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం పిడిఎస్‌యు, పివైఎల్‌ నిజామాబాద్‌ డివిజన్‌ ఆధ్వర్యంలో గన్‌పూర్‌ గ్రామంలో గాంధీవిగ్రహం వద్ద భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డివిజన్‌ అధ్యక్షులు సాయినాథ్‌ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ తన 12 ఏళ్ల వయసు నుంచి దేశం పట్ల అమితమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అని, జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం జరిగిన తర్వాత అక్కడికి వెళ్లి అక్కడ రక్తంతో తడిసిన మట్టి తీసుకొని ఇంటికి వెళ్లి సీసాలో పోసుకుని ఇంట్లో పెట్టుకుని పూజించిన వ్యక్తి భగత్‌ సింగ్‌ అని కొనియాడారు.

అంతేకాకుండా బ్రిటీష్‌ వారిని ఎదిరించిన భగత్‌ సింగ్‌, తను జైల్లో ఉన్నపుడు భారతీయ ఖైదీలకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని 60 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడని గుర్తుచేశారు. కార్యక్రమంలో అరుణ్‌ దాస్‌, విజయ్‌, గణేష్‌, బాలు, మహేష్‌, పద్వి, విశాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

27 వరకు పరీక్ష ఫీజు గడువు పెంపు

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయం పరిధిలో అన్ని అనుబంధ బి.ఎడ్‌. కళాశాల‌లోని ...

Comment on the article