Daily Archives: March 24, 2019

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య తెచ్చుకోదు..సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది.. మనం 16 గెల్చుకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడాలో మనమే నిర్ణయించవచ్చని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. ఆదివారం సాయంత్రం కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్‌ మండలం మొగిలిపేట, సిర్పూర్‌, మల్లాపూర్‌లలో రోడ్‌షోలో ప్రసంగించారు. బతుకమ్మతో కవిత, హాజరైన ప్రజలు పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న మన నాయకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశంలోనే ...

Read More »

డైట్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోండి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు 2019లో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు డైట్‌సెట్‌ 2019కి దరఖాస్తు చేసుకోవాలని హైమద్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బాలు ఒక ప్రకటనలో తెలిపారు. డైట్‌సెట్‌ 2019కి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైనట్టు చెప్పారు. తెలుగుమీడియం, ఇంగ్లీష్‌ మీడియంలో ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసేటపుడు ఎంట్రన్స్‌ను ఆంగ్లమాధ్యమంలో రాసినవారికి ఇంగ్లీష్‌మీడియంలో టిటిసి కోర్సు చేసే అవకాశముంటుందన్నారు. ఏప్రిల్‌ 4లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మే 22న రాష్ట్ర వ్యాప్తంగా డైట్‌ సెట్‌ ...

Read More »

ఆర్యవైశ్య ప్రతినిధులకు సన్మానం

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్యవైశ్య సంఘం నుంచి కామారెడ్డి జిల్లా అద్యక్షునిగా ఎన్నికైన కైలాస్‌ శ్రీనివాస్‌రావు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షునిగా ఎన్నికైన కౌన్సిలర్‌ ముప్పారపు ఆనంద్‌లను ఆదివారం ముష్‌రిఫ్‌భాగ్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పారు. ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజలింగం, శ్రీనివాస్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఐదేళ్లలో ఎంపి బిబి.పాటిల్‌ చేసిన అభివృద్ది శూన్యం

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ ఎంపిగా ఐదు సంవత్సరాలలో ఎంపి బి.బి.పాటిల్‌ చేసిన అభివృద్ది శూన్యమని కాంగ్రెస్‌ జహీరాబాద్‌ ఎంపి అభ్యర్థి మదన్‌మోహన్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ళు ఎంపి అసలు ఎక్కడున్నారో తెలియదని పేర్కొన్నారు. అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒరగబెట్టిందేమి లేదని చెప్పారు. అభివృద్ది కోసమే తాను పార్లమెంటు బరిలో ఉన్నానని, తనను ఎంపిగా గెలిపిస్తే ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. తెరాస, వైఎస్‌ఆర్‌సిపి ...

Read More »

మొక్కలు ఎండిపోకుండా గ్రీన్‌షెడ్స్‌ ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ప్రతి నర్సరీలో గ్రీన్‌షెడ్స్‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. ఆదివారం ఆయన సదాశివనగర్‌ మండలంలోని కుప్రియాల్‌, అడ్లూర్‌ ఎల్లారెడ్డి, మర్కల్‌ నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల నేమ్‌ బోర్డులను పెట్టాలని చెప్పారు. మండలంలోని 27 అటవీ, గ్రామాబివృద్ది శాఖ నర్సరీలకు వెంటనే గ్రీన్‌ షెడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓను ఆదేశించారు. ప్రతి వారం నివేదిక పంపాలన్నారు. ఉపాధి హామీ ద్వారా చేపట్టే ...

Read More »

25న మధుయాష్కి నామినేషన్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసీసీ కార్యదర్శి మధుగౌడ్‌ యాష్కీ 25వ తేదీ సోమవారం నిజామాబాద్‌ లోకసభ నియోజకవర్గం అభ్యర్థిగా కాంగ్రెస్‌ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేస్తున్నట్లు డీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్‌గౌడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వైస్రాయ్‌ గార్డెన్‌ లో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని, పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గ ఇంచార్జ్‌లు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి, పట్టణ శాఖల నాయకులు 11 గంటల వరకు వైస్రాయ్‌ గార్డెన్‌కు ...

Read More »

ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని వివిధ మీడియాలో రాజకీయ ప్రకటనలు జారీ చేసే సందర్భంలో ముందస్తుగా జిల్లా మీడియా సర్టిఫికెట్‌, మానిటరింగ్‌ కమిటీ (ఎంసిఎంసి) ద్వారా అనుమతి పొందిన తర్వాతనే జారీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, ఎంసిఎంసీ కమిటీ చైర్మన్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఎలక్ట్రానిక్‌ మీడియా, లోకల్‌ కేబుల్‌, టీవీ ఛానల్‌లో, రేడియో, ప్రైవేట్‌ ఎఫ్‌ఎం, సినిమాహాల్స్‌ ,ఆడియో విజువల్‌, సోషల్‌ ...

Read More »

సోమవారం ఆర్మూర్‌లో బిజెపి బహిరంగ సభ

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 25న సోమవారం ఆర్మూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో భారతీయ జనతాపార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, పార్టీ మీడియా సెల్‌ ఇంచార్జి జశ్వంత్‌ తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా హర్దీప్‌ సింగ్‌ పూరి (కేంద్ర మంత్రివర్యులు), జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక రైతుల ప్రధాన సమస్యలైన పసుపు, ఎర్రజోన్న పంటలకు సంబంధించిన శుభవార్తను తెలియజేయనున్నారని పేర్కొన్నారు. కావున రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ...

Read More »

కార్యకర్తలే టీడీపీకి బలం

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ నుండి సీనియర్‌ నాయకులు పార్టీ మారడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్‌ టీడీపీ ఉపాధ్యక్షులు వినోద్‌ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతమంది నాయకులు వెళ్లినా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందని, కార్యకర్తలతో పార్టీని పునర్నిర్మాణం చేసి తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు లేకుండా తెరాస, బీజేపీలు రాష్ట్రంలో అధికారం చలాయించాలని చూస్తున్నాయని, అలాగే పసుపు రైతుల నామినేషన్‌లు వేయకుండా ...

Read More »

యథేచ్ఛగా మొరం అక్రమ రవాణా

రెంజల్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం వచ్చిందంటే అంతే సంగతి అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా మొరం తరలించొచ్చు అనే నానుడి నిజం చేస్తున్నారు అక్రమ మొరం వ్యాపారులు. మండలంలోని సాటాపూర్‌ నుండి పెగడపెల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా మొరం రవాణా సాగిస్తున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్‌ల ద్వారా అక్రమంగా మొరం తరలిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టనట్టుగా వ్యవరించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు ...

Read More »

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ఆదివారం నగరంలోని రఘునాథ చెరువు వద్ద నిర్మాణం అవుతున్న మినీ ట్యాంక్‌ బ్యాండ్‌ పనులను పరిశీలించారు. ఆనంతరం వాసవి యువజన సంఘము నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More »

వ్యక్తి దారుణ హత్య

రెంజల్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం కమలాపూర్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. సగిలి సల్మాన్‌ (65) అనే వ్యక్తిని కొందరు దుండగులు గొడ్డలితో నరికి చంపినట్టు సమాచారం. కాగా మతుడి భార్య రెండు నెలల క్రితమే అనారోగ్యంతో మతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Read More »

దేశాభివద్ధిలో సీఎం కేసీఆర్‌ సేవలు అవసరం

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో దేశాభివద్ధి జరుగుతుందని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ దేశ రాజకీయాల్లో కీలకం అవుతుందన్నారు. ఆదివారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలో రోడ్డు షోలో ఆమె ప్రసంగించారు. భారతదేశ సమాజమంతా కెసిఆర్‌ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని కవిత తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు కెసిఆర్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని వివరించారు. 16 మంది ఎంపీలను గెలిపించి ...

Read More »

25 లక్షల నగదు స్వాధీనం

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎటువంటి ఆధారాలు లేకుండా కారులో రవాణా చేస్తున్న 25 లక్షల నగదును చెకింగ్‌ టీం గుర్తించి పట్టుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం స్థానిక నాగారం స్టేడియం వద్ద కారును ఆపి పరిశీలించగా అవసరమైన ఆధారాలు లేకుండా 25 లక్షల 81 వేల 250 రూపాయలను ఎస్‌ఎస్‌టిటీం సీజ్‌ చేసిందని కలెక్టర్‌ తెలిపారు. టీఎస్‌ 07 ఎఫ్‌ జెడ్‌ 1544 కారులో తరలిస్తున్న నగదును పంచనామా ...

Read More »

కేటాయించిన గదులకు చేరిన ఈవీఎంలు

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొదటి దశ ర్యాండమైజేషన్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉపయోగించే ఈవీఎంలను కేటాయించిన గదులలో భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. ఆదివారం స్థానిక 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కనగల ఈవీఎం గోదాములను పర్యవేక్షించారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన మొదటిదశ ఈవీఎంల కేటాయింపును పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన గదులలో ఈవీఎంలను వాటి నంబర్లను పరిశీలించి భద్రపరచడం జరిగిందని ఆయన తెలిపారు. వీటిని ఎన్నికలకు ముందు ...

Read More »

ఎంపి కవితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం

జగిత్యాల, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాయికల్‌ మండలం బోర్నపెల్లి గ్రామంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సతీమణి రాధిక సంజయ్‌ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగిత్యాల నియోజకవర్గ అభివద్ధికి కషి చేసిన కవిత కోసం కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతొ గెలిపించాలని కోరారు. తెరాస ప్రభుత్వ హయంలో ఎన్నో అభివద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని తెలిపారు. బోర్నపెల్లి ...

Read More »

సువిధ అనుమతులకు అభ్యర్థులు, ఏజెంట్లు మాత్రమే దరఖాస్తు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికలకు వాహనాలు, సభలు, ర్యాలీలకు అవసరమైన అనుమతుల కొరకు సువిధ వెబ్‌ సైట్‌ ద్వారా పోటీ చేసే అభ్యర్థులు లేదా వారి ఏజెంట్‌ మాత్రమే దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఒక ప్రకటనలో సూచించారు. అనుమతులన్నిటికీ సువిధ వెబ్‌ సైట్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాహనాలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతులకై 48 గంటల కంటే ముందుగానే దరఖాస్తు చేయాలని ప్రకటనలో కలెక్టర్‌ సూచించారు. పోటీచేసే అభ్యర్థులు లేదా ...

Read More »

విప్లవం ద్వారానే దేశానికి స్వాతంత్య్రం

డిచ్‌పల్లి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం డిచ్‌పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో భగత్‌ సింగ్‌ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు దాసు విచ్చేసి మాట్లాడారు. భగత్‌ సింగ్‌ తన చిరుప్రాయంలోనే ఉరికంబాన్ని సైతం నవ్వుతూ స్వీకరించాడని, దేశం కోసం ఆరోజు బ్రిటిష్‌వారు వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడి సంపదను దోచుకోవడానికి రాజుల మధ్య ఉన్న విభేదాలను గుర్తించి వారు భారతదేశాన్ని వాళ్ల గుప్పిట్లోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఆ సమయంలో యువత భగత్‌సింగ్‌, ...

Read More »

మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

బీర్కూర్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నసురుల్లాబాద్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఎన్నికల అధికారిగా జ్యోతి నిర్వహించారు. ఎన్నికల్లో అధ్యక్షుడుగా భరత్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడుగా బాలబోయి, ప్రధాన కార్యదర్శిగా ముత్యం రాములు, క్యాషియర్‌గా చిన్న మొగులయ్య, డైరెక్టర్లుగా పెద్ద మోహన్‌, పెద్ద సాయులు, వినయ్‌ కుమార్‌, శైలేష్‌, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పాల్గొని ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన మత్స్యకారులకు ధన్యవాదాలు తెలుపుతూ సంఘం యొక్క అభివద్ధి కి శాయశక్తులా కషి చేస్తానని అధ్యక్షులు భరత్‌ ...

Read More »

బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ బీడీ పరిశ్రమ. కోటిన్నర మంది కార్మికులు ఉఫాది పొందుతున్నారు. ఈ పరిశ్రమను నిరివీర్యం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని యూనియన్‌ రాష్ట్ర నాయకులు కష్ణ ఆరోపించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులకు కొన్ని కంపెనీలు నెలకు 5 లేదా 10 రోజులు, మరికొన్ని కంపెనీలు నెలకు 15 లేదా 18 రోజులు పని కల్పిస్తున్నారని, కార్మికులు ఆర్థికంగా నష్ట పోతున్నారని, కాబట్టి ...

Read More »