Breaking News

డైట్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోండి

కామారెడ్డి, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు 2019లో ఇంటర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు డైట్‌సెట్‌ 2019కి దరఖాస్తు చేసుకోవాలని హైమద్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బాలు ఒక ప్రకటనలో తెలిపారు. డైట్‌సెట్‌ 2019కి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైనట్టు చెప్పారు. తెలుగుమీడియం, ఇంగ్లీష్‌ మీడియంలో ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసేటపుడు ఎంట్రన్స్‌ను ఆంగ్లమాధ్యమంలో రాసినవారికి ఇంగ్లీష్‌మీడియంలో టిటిసి కోర్సు చేసే అవకాశముంటుందన్నారు. ఏప్రిల్‌ 4లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మే 22న రాష్ట్ర వ్యాప్తంగా డైట్‌ సెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసే సమయంలో సమస్యలుంటే 9492874006 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Check Also

వరవరావు, సాయిబాబాను విడుదల‌ చేయాలి

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విప్లవ రచయిత నాయకులు వరవరరావును, సాయి బాబాను జైలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *