Breaking News

విప్లవం ద్వారానే దేశానికి స్వాతంత్య్రం

డిచ్‌పల్లి, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం డిచ్‌పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో భగత్‌ సింగ్‌ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు దాసు విచ్చేసి మాట్లాడారు. భగత్‌ సింగ్‌ తన చిరుప్రాయంలోనే ఉరికంబాన్ని సైతం నవ్వుతూ స్వీకరించాడని, దేశం కోసం ఆరోజు బ్రిటిష్‌వారు వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడి సంపదను దోచుకోవడానికి రాజుల మధ్య ఉన్న విభేదాలను గుర్తించి వారు భారతదేశాన్ని వాళ్ల గుప్పిట్లోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఆ సమయంలో యువత భగత్‌సింగ్‌, రాజుగారు, అల్లూరి సీతారామరాజు విప్లవం ద్వారానే భారతదేశాన్ని స్వతంత్రం సంపాదించుకోవాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగిందన్నారు. భగత్‌సింగ్‌ పార్లమెంటుపై బాంబు దాడి చేయడం జరిగిందని, దాడిచేసి కూడా పారిపోకుండా అక్కడే కరపత్రాలు పంచి నినాదాలు చేస్తూ స్వచ్ఛందంగా అరెస్టు కావడం జరిగిందన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి భగత్‌ సింగ్‌ అడుగుజాడల్లో నడిచి అతని ఆశయాలు సాధించినప్పుడే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో పివైఎల్‌ నిజామాబాద్‌ డివిజన్‌ అధ్యక్షులు సాయినాథ్‌, జిల్లా నాయకులు సాయిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దేవస్వామి, సర్పంచ్‌ ఉప సర్పంచ్‌ గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మెంట్రాజ్‌పల్లిలో

మెంట్రాజ్‌పల్లి గ్రామంలో భగత్‌ సింగ్‌ వర్ధంతి నిర్వహించడం జరిగింది. సభలో సర్పంచ్‌ నర్సయ్య, ఉపసర్పంచ్‌ రాజలింగం, చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ క ష్ణారెడ్డి, పివైఎల్‌ జిల్లా ఉపాధ్యక్షులు దేవస్వామి, రాష్ట్ర నాయకులు సాయిరెడ్డి, బాబన్న, ధర్మన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *