Breaking News
రోడ్‌షోలో ప్రసంగిస్తున్న ఎంపి కవిత

కేంద్రంలో హంగ్‌ : మనమే కీలకం : ఎంపి కవిత

జగిత్యాల, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, అట్లాగే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య తెచ్చుకోదు..సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది.. మనం 16 గెల్చుకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడాలో మనమే నిర్ణయించవచ్చని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. ఆదివారం సాయంత్రం కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్‌ మండలం మొగిలిపేట, సిర్పూర్‌, మల్లాపూర్‌లలో రోడ్‌షోలో ప్రసంగించారు.

బతుకమ్మతో కవిత, హాజరైన ప్రజలు

పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న మన నాయకుడు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ దేశంలోనే నెంబర్‌ 1 సీఎం అని ఇటీవల ఒక సర్వే స్పష్టం చేసిందని కవిత వివరించారు. సంక్షేమ అభివద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికి రోల్‌ మోడల్‌ అని అన్నారు. దేశాన్ని అభివద్ధి పథంలో నడిపించే నాయకుడు కేసీఆర్‌ అని దేశమంతా విశ్వసిస్తుందని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా,24 గంటల కరెంటు, బీడీ కార్మికులకు పెన్షన్‌, వద్ధాప్య పెన్షన్ల అర్హత వయసు తగ్గింపు, నిరుద్యోగ భతి, కేసీఆర్‌ కిట్లు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయని తెలిపారు. రెండేళ్లలో కోరుట్ల నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభించి ఐదేళ్ళు పూర్తి చేస్తామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. అభివద్ధి చెందిన దేశాల మాదిరిగా మన దేశం అభివ ద్ధి చెందాలని మన పిల్లలు కోరుకుంటున్నారని దానికోసం ఒక విజన్‌ ఉన్న నాయకుడు, దార్శనికత కలిగిన ప్రభుత్వం అవసరమని చెప్పారు. అది కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

తెలంగాణ అభివద్ధి చెందుతున్నంత వేగంగా దేశం అంతటా ఇదే విధమైన అభివద్ధి జరగాలని ఇందుకోసం జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాల్లో భాగస్వాములయ్యే విధంగా మనం ఉండాలని కవిత చెప్పారు. 16 ఎంపీలను కేసీఆర్‌ చేతిలో పెడితే ఆయన తన రాజకీయ చతురతతో 116 ఎంపీలను తయారు చేస్తారని వివరించారు. పసుపు బోర్డు, సింగరేణి కార్మికులు, రైతుల సమస్యలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై పార్లమెంటులో నేను మాట్లాడాను..గల్లీలో ప్రజలకు సేవకులుగా…డిల్లీలో సైనికులుగా పని చేశాం..మళ్లీ నన్ను ఆశీర్వదించి ఢిల్లీకి పంపిస్తే మరింత వేగంగా మన నియోజకవర్గం అభివద్ధి చేస్తానని చెప్పారు. సోమన్న గుట్ట రోడ్డును అభివద్ధి పరుస్తామని మెట్లెక్కి మొక్కు తీర్చుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు, మార్క్‌ ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపు రెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Check Also

బీర్కూర్‌లో జాతీయ బాలికా దినోత్సవం

బీర్కూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతి బా పులే బాలుర పాఠశాల బీర్కూర్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *