Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న మదన్‌మోహన్‌రావు

ఐదేళ్లలో ఎంపి బిబి.పాటిల్‌ చేసిన అభివృద్ది శూన్యం

కామారెడ్డి, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ ఎంపిగా ఐదు సంవత్సరాలలో ఎంపి బి.బి.పాటిల్‌ చేసిన అభివృద్ది శూన్యమని కాంగ్రెస్‌ జహీరాబాద్‌ ఎంపి అభ్యర్థి మదన్‌మోహన్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ళు ఎంపి అసలు ఎక్కడున్నారో తెలియదని పేర్కొన్నారు. అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒరగబెట్టిందేమి లేదని చెప్పారు. అభివృద్ది కోసమే తాను పార్లమెంటు బరిలో ఉన్నానని, తనను ఎంపిగా గెలిపిస్తే ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. తెరాస, వైఎస్‌ఆర్‌సిపి పార్టీలు తమ మిత్రులని కేంద్రమంత్రి చెప్పారని, తెరాసకు ఓటు వేస్తే మోడికి ఓటు వేసినట్టేనని అన్నారు.

20 దేశాల్లో ఐటి కంపెనీలు పెట్టి ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించానని పేర్కొన్నారు. రైతుల కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెడతానని, జహీరాబాద్‌ను మోడల్‌ పార్లమెంటుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. బి.బి.పాటిల్‌ ఐదేళ్లలో కేంద్రంనుంచి 25 కోట్ల నిదులొస్తే కేవలం 4 కోట్ల 80 లక్షలు మాత్రమే ఖర్చుచేశారని, ఇది ఆయన పనితీరుకు ఒక మచ్చుతునక అని ఎద్దేవా చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, నాయకులు నిమ్మ మోహన్‌రెడ్డి, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, అంజద్‌, తదితరులున్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *