Breaking News
రోడ్‌షోలో ప్రసంగిస్తున్న ఎంపి కవిత

దేశాభివద్ధిలో సీఎం కేసీఆర్‌ సేవలు అవసరం

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో దేశాభివద్ధి జరుగుతుందని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ దేశ రాజకీయాల్లో కీలకం అవుతుందన్నారు. ఆదివారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలో రోడ్డు షోలో ఆమె ప్రసంగించారు. భారతదేశ సమాజమంతా కెసిఆర్‌ నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని కవిత తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు కెసిఆర్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని వివరించారు. 16 మంది ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపిస్తే… కేసీఆర్‌ మరో 100 మందిని కూడగట్టి ఆ సంఖ్యను 116 చేస్తారని చెప్పారు. ఆయన రాజకీయ అనుభవం, కమిట్‌మెంట్‌, ఇతర పార్టీలతో ఉన్న సంబంధాలు లక్ష్య సాధనకు ఉపయోగపడతాయని చెప్పారు.

కాంగ్రెస్‌ అంటేనే కరప్షన్‌ పార్టీ అని మన అందరికీ తెలుసు అట్లాగే బిజెపి అంటేనే మందిర్‌ వివాదం గుర్తుకు వస్తుందన్నారు. ఈ రెండు పార్టీల నుంచి దేశాన్ని బయటపడేయాల్సిన అవసరముందన్నారు. అందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేశారని కవిత వివరించారు. బిజెపి రాష్ట్ర ప్రభుత్వ పథకాల పైన గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని విమర్శించారు. పెన్షన్లకు ఇస్తున్న వెయ్యి రూపాయలులో కేంద్రమే 800 ఇస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాస్తవానికి కేంద్రం ఇచ్చేది 200 రూపాయలు మాత్రమే అన్నారు. మే నెల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్‌గా అందుతాయని చెప్పారు. రెండేళ్లలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను కట్టించాలని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తామని ఎంపీ కవిత ప్రజలకు తెలిపారు. టిఆర్‌ఎస్‌ ప్రాంతీయ పార్టీ.. ఆ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఢిల్లీలో ఏం చేస్తారని కాంగ్రెస్‌, బిజెపి నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణను సాధించిన విషయాన్ని వారికి గుర్తు చేయాలన్నారు.

హాజరైన ప్రజలు

ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఆ రెండు పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఆ మెసేజ్‌ల పట్ల, అసత్య ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. మన ముఖ్యమంత్రి ప్రజల ఆత్మ బంధువు అని చెప్పారు. మనందరి బాగోగులు ఆయన చూసుకుంటారని అన్నారు. ఐదేళ్లుగా అభివద్ధిలో భాగస్వామి అవుతూ మీతో నడిచిన నన్ను మళ్లీ ఎంపిగా గెలిపించాలని ఎంపీ కవిత కోరారు. రోడ్‌ షోలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ సుమనా రెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం ఆనంద్‌రెడ్డి, ఈగ గంగారెడ్డి, బాజిరెడ్డి జగన్‌, ఎంపిపి మంజుల, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *