Breaking News
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సతీమణి

ఎంపి కవితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం

జగిత్యాల, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాయికల్‌ మండలం బోర్నపెల్లి గ్రామంలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు మద్దతుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ సతీమణి రాధిక సంజయ్‌ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగిత్యాల నియోజకవర్గ అభివద్ధికి కషి చేసిన కవిత కోసం కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతొ గెలిపించాలని కోరారు. తెరాస ప్రభుత్వ హయంలో ఎన్నో అభివద్ధి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని తెలిపారు. బోర్నపెల్లి గ్రామ అభివద్ధికి ఎంపీ, ఎమ్మెల్యే అభివద్ధికి కషి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ పాదం లత రాజు, ఎంపీపీ పడాల పూర్ణిమ, సింగిల్‌ విండో అధ్యక్షుడు కొల శ్రీనివాస్‌, ఏనుగందుల ఉదయశ్రీ, గండ్ర రమాదేవి, ఉత్కమ్‌ రాధ, మాల్యాల జలపతి రెడ్డి, కొత్త బుచ్చన్న, ఆత్రం బిర్సావ్‌, ఆనందరావు, రాజేశ్వర్‌ రావు, మహిళలు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *