Breaking News
ఆర్యవైశ్యులను సన్మానిస్తున్న దృశ్యం

ఆర్యవైశ్య ప్రతినిధులకు సన్మానం

కామారెడ్డి, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్యవైశ్య సంఘం నుంచి కామారెడ్డి జిల్లా అద్యక్షునిగా ఎన్నికైన కైలాస్‌ శ్రీనివాస్‌రావు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షునిగా ఎన్నికైన కౌన్సిలర్‌ ముప్పారపు ఆనంద్‌లను ఆదివారం ముష్‌రిఫ్‌భాగ్‌ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పారు. ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభ్యున్నతికి తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజలింగం, శ్రీనివాస్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *