Breaking News
నర్సరీలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌

మొక్కలు ఎండిపోకుండా గ్రీన్‌షెడ్స్‌ ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ప్రతి నర్సరీలో గ్రీన్‌షెడ్స్‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. ఆదివారం ఆయన సదాశివనగర్‌ మండలంలోని కుప్రియాల్‌, అడ్లూర్‌ ఎల్లారెడ్డి, మర్కల్‌ నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కల నేమ్‌ బోర్డులను పెట్టాలని చెప్పారు. మండలంలోని 27 అటవీ, గ్రామాబివృద్ది శాఖ నర్సరీలకు వెంటనే గ్రీన్‌ షెడ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓను ఆదేశించారు. ప్రతి వారం నివేదిక పంపాలన్నారు. ఉపాధి హామీ ద్వారా చేపట్టే పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణం, కిచెన్‌షెడ్స్‌ల నిర్మాణాలపై ఆరాతీశారు. వాటిని ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట డిఎఫ్‌వో వసంత, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి తదితరులున్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *