Breaking News
ఈవిఎంలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌

కేటాయించిన గదులకు చేరిన ఈవీఎంలు

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొదటి దశ ర్యాండమైజేషన్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉపయోగించే ఈవీఎంలను కేటాయించిన గదులలో భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. ఆదివారం స్థానిక 4వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పక్కనగల ఈవీఎం గోదాములను పర్యవేక్షించారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన మొదటిదశ ఈవీఎంల కేటాయింపును పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన గదులలో ఈవీఎంలను వాటి నంబర్లను పరిశీలించి భద్రపరచడం జరిగిందని ఆయన తెలిపారు.

వీటిని ఎన్నికలకు ముందు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాలకు పంపించిన తర్వాత అక్కడ రెండవ విడత రాండమైజేషన్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. వేడి ఎక్కువగా ఉన్నందున ఈవీఎంలను, వివి ప్యాట్లను గదులలో గాలి వచ్చే విధంగా దూరం దూరంగా అమర్చాలని సిబ్బందిని ఆదేశించారు. వీటన్నిటికీ మొదటి విడత చెకింగ్‌ పూర్తి చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్‌ ఏవో శ్రీధర్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *