Breaking News

సోమవారం ఆర్మూర్‌లో బిజెపి బహిరంగ సభ

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 25న సోమవారం ఆర్మూర్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో భారతీయ జనతాపార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, పార్టీ మీడియా సెల్‌ ఇంచార్జి జశ్వంత్‌ తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా హర్దీప్‌ సింగ్‌ పూరి (కేంద్ర మంత్రివర్యులు), జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక రైతుల ప్రధాన సమస్యలైన పసుపు, ఎర్రజోన్న పంటలకు సంబంధించిన శుభవార్తను తెలియజేయనున్నారని పేర్కొన్నారు. కావున రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మోడీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనగలరని బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి పిలుపు ఇచ్చారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *