Breaking News
జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

సువిధ అనుమతులకు అభ్యర్థులు, ఏజెంట్లు మాత్రమే దరఖాస్తు చేయాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికలకు వాహనాలు, సభలు, ర్యాలీలకు అవసరమైన అనుమతుల కొరకు సువిధ వెబ్‌ సైట్‌ ద్వారా పోటీ చేసే అభ్యర్థులు లేదా వారి ఏజెంట్‌ మాత్రమే దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఒక ప్రకటనలో సూచించారు. అనుమతులన్నిటికీ సువిధ వెబ్‌ సైట్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాహనాలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతులకై 48 గంటల కంటే ముందుగానే దరఖాస్తు చేయాలని ప్రకటనలో కలెక్టర్‌ సూచించారు. పోటీచేసే అభ్యర్థులు లేదా అధికారికంగా అనుమతి పొందిన అతని ఏజెంట్‌ మాత్రమే అనుమతులకు దరఖాస్తు చేయాలన్నారు. సంబంధిత సహాయ రిటర్నింగ్‌ అధికారికి అన్ని ధ్రువపత్రాలు డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్‌ చేసి దరఖాస్తు చేయాలని, అదేవిధంగా జిల్లా పరిధిలో వాహనాల అనుమతికి, హెలిక్యాప్టర్‌ అనుమతికి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేయాలని ప్రకటనలో తెలిపారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *