Breaking News
జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని వివిధ మీడియాలో రాజకీయ ప్రకటనలు జారీ చేసే సందర్భంలో ముందస్తుగా జిల్లా మీడియా సర్టిఫికెట్‌, మానిటరింగ్‌ కమిటీ (ఎంసిఎంసి) ద్వారా అనుమతి పొందిన తర్వాతనే జారీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌, ఎంసిఎంసీ కమిటీ చైర్మన్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ఎలక్ట్రానిక్‌ మీడియా, లోకల్‌ కేబుల్‌, టీవీ ఛానల్‌లో, రేడియో, ప్రైవేట్‌ ఎఫ్‌ఎం, సినిమాహాల్స్‌ ,ఆడియో విజువల్‌, సోషల్‌ మీడియా, వెబ్‌సైట్‌లలో ప్రకటనల కొరకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని లేనిపక్షంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ననుసరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అంతేకాకుండా బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ వాయిస్‌ ఎస్‌ఎంఎస్‌లు కూడా అనుమతి తప్పనిసరి అని చెప్పారు. పోలింగ్‌ 48 గంటల ముందు నుండి బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు వాయిస్‌ మెసేజ్‌ ఇవ్వకూడదని ఈ విషయంలో సెల్ఫోన్‌ కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని ఒకవేళ మెసేజ్‌లు జారీ చేసిన వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలింగ్‌కు 48 గంటలు ముందుగా అనగా ఏప్రిల్‌ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి మెసేజ్‌లు పంపించకూడదని కలెక్టర్‌ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ హెచ్చరించారు.

Check Also

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *