Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న తెదేపా నాయకులు

కార్యకర్తలే టీడీపీకి బలం

నిజామాబాద్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగుదేశం పార్టీ నుండి సీనియర్‌ నాయకులు పార్టీ మారడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నిజామాబాద్‌ టీడీపీ ఉపాధ్యక్షులు వినోద్‌ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతమంది నాయకులు వెళ్లినా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందని, కార్యకర్తలతో పార్టీని పునర్నిర్మాణం చేసి తిరుగులేని పార్టీగా తీర్చిదిద్దుతామన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు లేకుండా తెరాస, బీజేపీలు రాష్ట్రంలో అధికారం చలాయించాలని చూస్తున్నాయని, అలాగే పసుపు రైతుల నామినేషన్‌లు వేయకుండా అడ్డుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

గతంలో కవిత, కేసీఆర్‌లు ఇచ్చిన హామీలు పసుపు బోర్డు, నిజాంసుగర్‌ ఫ్యాక్టరీల హామీలు నెరవేర్చకుండానే మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తూ పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఓట్లు అడగటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఐదు సంవత్సరాలు ఎంపీగా లోక్‌ సభలో మొత్తం పనిధినాల్లో 50 శాతం రోజులు కూడా కవిత సభకు హాజరు కాలేదని ఆరోపించారు. జిల్లాలో ఎంతోమంది ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారని, వారి గురించి పట్టించుకునే తీరిక కవితకు లేదని విమర్శించారు. ఎర్రజొన్న రైతులు లోక్‌ సభ ఎన్నికలకు రైతులు నామినేషన్లు వేసి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. సమావేశంలో గోపాల్‌ నాగేష్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, వినోద్‌ కుమార్‌ రాష్ట్ర ఎస్సి సెల్‌ ఉపాధ్యక్షుడు, దేగం యాదగౌడ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, రేంజర్ల సురేష్‌, నర్సింలు జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్షుడు, రాజశేఖర్‌ మావూరి జిల్లా టిఎస్‌ఎన్‌వి అధ్యక్షులు, మన్నన్‌, అంబికా సత్యనారాయణ, రాజపోశెట్టి, హన్మంతరావు, శాంతి మేస్ట్రీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *