Breaking News

Daily Archives: March 25, 2019

రాష్ట్రంలో నియంతత్వ పాలన

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో నియంతత్వ పాలన కొనసాగుతుందని భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఆరోపించారు. సోమవారం సాయంత్రం ఆర్మూర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి ఈనెల 28వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని తెలిపారు. 2014లో సాదించిన స్థానాలకంటే ఎక్కువ స్థానాలు బీజేపీ సాధించబోతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో బీజేపీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోదని, రాష్ట్ర సమస్యలను ...

Read More »

మైనార్టీలకు అండగ తెరాస ప్రభుత్వం

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ ప్రజలకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగ ఉంటుందని నిజామాబాద్‌ తాజా మాజీ ఎంపీ కవిత అన్నారు. సోమవారం అర్సపల్లి ఫ్రూట్‌ మార్కెట్‌ నయిమ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మైనార్టీ సమావేశంలో ఎంపి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీలు భారీగా హాజరై ఘన స్వాగతం పలికారు. సమావేశంలో ఎమ్మెల్యేలు షఖిల్‌, బిగాల గణేష్‌ గుప్తా, మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి, మేయర్‌ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్‌ ఫహిం, రెడ్‌ కో ...

Read More »

తెరాసలోకి ఎంఆర్‌పిఎస్‌ నాయకులు

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాదులో ఎంపీ కవిత కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మందకష్ణ వర్గం రాష్ట్ర ఉపాధ్యక్షులు తరికెల పోశెట్టితో పాటు నందిపేట్‌ మండల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే నిజామాబాద్‌ నగర నాయకులు పంజాల శ్యాంసుందర్‌, రాంబాబు, సురేష్‌లు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికీ ఎంపీ కవిత గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అన్ని వర్గాలతో పాటు మాదిగల అభివద్ధికి కషి చేస్తున్న ఎంపీ కవితను బారీ మెజార్టీతో గెలిపించుకుంటామని టిఆర్‌ఎస్‌లో చేరిన ...

Read More »

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బిగాల

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారంనిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా 2, 3వ డివిజన్లలో కార్పొరేటర్లతో ఇంటింటికి ఎన్నికల ప్రచారం చేవారు. కంఠేశ్వర కల్యాణ మండపంలో డివిజన్‌ ప్రజలతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అందిస్తున్న పథకాలు దేశంలో పలు రాష్ట్రాలు మన తెలంగాణ పథకాలకు ఆకర్షితులై వారి రాష్ట్రాలలో కూడా కేసీఆర్‌ అందిస్తున్న పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా ఇంతకు ముందు విద్యుత్‌ కొరత ఉండేదని తెలంగాణ ...

Read More »

డయల్‌ యువర్‌ సిపికి ఏడు ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపికి ఏడు ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్‌ డివిజన్‌, బోధన్‌, ఆర్మూర్‌ డివిజన్‌ల నుంచి ప్రజలు డయల్‌ యువర్‌ సిపి ద్వారా కమీషనర్‌ కార్తికేయతో మాట్లాడారు. ఇట్టి సమస్యలపై కమీషనర్‌ స్పందిస్తు పిర్యాదుల పూర్వాపరాలు పరిశీలించి ఆయా స్టేషన్ల అధికారులకు పంపించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలందరు తాము ఎదుర్కొంటున్న సమస్యలను డయల్‌ యువర్‌ సిపి ద్వారా ...

Read More »

వెంకటేశ్వర హీరో ఆధ్వర్యంలో సేల్స్‌ కార్నివాల్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో సోమవారం వెంకటేశ్వర హీరో వినాయక్‌నగర్‌ వారి ఆధ్వర్యంలో సేల్స్‌ కార్నివాల్‌ నిర్వహించడం జరిగింది. వినియోగదారులకు మరిన్ని సేవలు అందించడానికి వర్నిరోడ్డు చౌరస్తాలోని గంప కాంప్లెక్సులో మూడురోజుల పాటు సేల్స్‌ కార్నివాల్‌ ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ యూనియన్‌ బ్యాంకు నిజామాబాద్‌ మేనేజర్‌ యుగందర్‌ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్నివాల్‌ సోమవారం నుంచి 27వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ప్రతి హీరో వాహన ...

Read More »

మురికి కాలువలో యువకుని మృతి

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం పక్కన సైకిల్‌ టాక్స్‌ ముందుగల మురికికాలువలో సోమవారం గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి అతను ఇంద్రనగర్‌ కాలనీకి చెందిన సాయిలుగా గుర్తించారు. కామారెడ్డిలో అడ్డా కూలీగా పనిచేసేవాడని, మృతునికి భార్య, కూతురు ఉన్నారని తెలిపారు. తరచుగా ఫిట్స్‌ వస్తుండేదని పేర్కొన్నారు. కూలీ పని చేసి వచ్చిన అనంతరం మద్యం సేవించి మురికి కాలువపక్కన అరుగుపై ...

Read More »

తెరాస ఎంపి అభ్యర్థిగా పాటిల్‌ నామినేషన్‌

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా బి.బి.పాటిల్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, క్రాంతికిరణ్‌, హన్మంత్‌షిండే, గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు ఉన్నారు.

Read More »

జహీరాబాద్‌ బిజెపి ఎంపి అభ్యర్థిగా బాణాల నామినేషన్‌

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా సోమవారం బాణాల లక్ష్మారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. దేశంలో గత ఐదేళ్లలో మోడిచేసిన సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల తెరాస పాలనలో ఎంపి, ఎమ్మెల్యేల స్థాయిలో తెరాస నాయకులు ఒరగబెట్టిందేమి లేదని విమర్శించారు. కనీసం స్థానికంగా ఉండని నేతలు ఇక ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు. బిజెపి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా చేపట్టామని, ప్రజలు ...

Read More »

ప్రొజెక్టర్‌ వితరణ

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఓరియంటల్‌ ఉన్నత పాఠశాలకు సోమవారం పలు సంస్థలు ప్రొజెక్టర్‌ వితరణ చేశారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి, కామారెడ్డి జిల్లాఆర్యవైశ్య మహాసభ, పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డితో పాటు ఈశ్వర్‌ ట్రస్టు అధినేత విశ్వనాథుల అనితా మహేశ్‌ గుప్తలు ఓరియంటల్‌ పాఠశాలతోపాటు శాబ్దిపూర్‌ పాఠశాలకు ప్రొజెక్టర్లు అందజేశారు. కార్యక్రమంలో సంస్థల ప్రతినిదులు పబ్బ శ్రీహరి, మహేశ్‌ గుప్త, నరహరి, ముప్పారపు ఆనంద్‌, కృష్ణమూర్తి, రాజేందర్‌, శ్రీనివాస్‌, ...

Read More »

రికార్డు స్థాయిలో నామినేషన్‌లు

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ లోక్‌ సభకు రికార్డ్‌ స్థాయిలో నామినేషన్‌లు దాఖలయ్యాయి. సోమవారం చివరి రోజు కావడంతో ఒక్క రోజే 179 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. బయటకు గంభీరం ప్రదర్శిస్తున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారు. రైతులు నామినేషన్‌ విషయంలో మొదట్లో ఉదాసీనంగా వ్యవరించినా మొత్తం 242 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ప్రధాన పార్టీలు ఖంగుతున్నాయి. మొత్తం నామినేషన్లు 247 నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. మార్చి 20న ఏడుగురు, ...

Read More »

తెరాసలోకి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు

నిజామాబాద్‌, మార్చ్‌ 25 మాట్లాడుతున్న దాసరి నర్సింహులు నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం ఎంపీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు దాసరి నరసింహులు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి బంటు బలరాములు వారి అనుచరులతో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరారు. రెంజర్ల గంగాధర్‌, బి. జనార్ధన్‌, ప్రతాప్‌ రుద్ర, మల్లేష్‌, వర్మ, బంటు గణేష్‌, జిలకర లక్ష్మణ్‌, నరేందర్‌, ...

Read More »

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆగడాలకు దిగితే సహించేదు

నిజామాబాద్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారం అడ్డంపెట్టుకుని ఆగడాలకు దిగేతే సహించేదిలేదని కాంగ్రెస్‌ నిజామాబాద్‌ లోకసభ అభ్యర్థి మధుగౌడ్‌ యాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్‌లో జరిగిన పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మధుగౌడ్‌ ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని ఆరోపించారు. అక్రమకేసులు పెడుతూ కాంగ్రెస్‌ కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు. వీటిని ఆపకపోతే సహించేదిలేదన్నారు. కేసులు పెడుతూ వేధిస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్నారు. కవితను ఓడించి కేసీఆర్‌ దిమ్మెతిరిగే ...

Read More »

ఎంపీ కవిత సభ విజయవంతం చేయండి

రెంజల్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే పార్లమెంట్‌ సభ్యురాలు కవిత బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం సాటాపూర్‌లో మార్కెట్‌ గ్రౌండ్లో ఉదయం 8:30 గంటలకు ఎంపీ కవిత భారీ బహిరంగ సభకు మండలంలోని ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తరలివచ్చి సభ విజయవంతం చేయాలన్నారు. దేశంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న అతి చిన్న వయస్కురాలుగా ...

Read More »

విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ

రెంజల్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీల గ్రామంలోని మరియ రాణి పాఠశాలలో బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ స్పోకెన్‌ ఇంగ్లీష్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు 45 రోజుల పాటు ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసులను నిర్వహించడం జరిగిందని (సిఇవో) సెంట్రల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ అతుఫానౌషి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంగ్ల బోధనపై విద్యార్థులకు పరిజ్ఞానం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్టు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ...

Read More »

ఇందూరు సకల కళలకు, సాహితీ వేత్తలకు పుట్టినిల్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందూరు నగరం శాస్త్రీయ సంగీత, నృత్య సొబగుల, కవులు, సాహితీవేత్తలకు పుట్టినిల్లని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఛైర్మన్‌ మామిడి హరికృష్ణ అన్నారు. జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల 47వ వార్షికోత్సవం ఆదివారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భాషే తెలియని కాలంలోకూడా సంగీతం ఉండేదన్నారు. శోకం శ్లోకంగా మారిందని అభివర్ణించారు. ఎన్నో యుగాల పూర్వం నుంచి శ్లోకాలు పుట్టాయని పేర్కొన్నారు. శాస్త్రీయ ...

Read More »