Breaking News
మాట్లాడుతున్న ఎంపి కవిత

తెరాసలోకి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు

నిజామాబాద్‌, మార్చ్‌ 25

మాట్లాడుతున్న దాసరి నర్సింహులు

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సోమవారం ఎంపీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షులు దాసరి నరసింహులు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి బంటు బలరాములు వారి అనుచరులతో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరారు. రెంజర్ల గంగాధర్‌, బి. జనార్ధన్‌, ప్రతాప్‌ రుద్ర, మల్లేష్‌, వర్మ, బంటు గణేష్‌, జిలకర లక్ష్మణ్‌, నరేందర్‌, గౌడ్‌ అపర్ణ, లావణ్య, గంగామణి, బంటు నిర్మల, యాదగిరి తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా దాసరి నర్సింహులు మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివద్ధికి పాటుపడుతున్న ఎంపీ కవితను గెలిపించేందుకు తాము కాంగ్రెస్‌ పార్టీని వీడినట్లు తెలిపారు. టిఆర్‌ఎస్‌తోనే జిల్లా, రాష్ట్రం అభివద్ధి చెందుతుందని చెప్పారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, మేయర్‌ ఆకుల సుజాత, నుడా డైరెక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *