Breaking News
మురికి కాలువలో పడిన యువకుడు

మురికి కాలువలో యువకుని మృతి

కామారెడ్డి, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం పక్కన సైకిల్‌ టాక్స్‌ ముందుగల మురికికాలువలో సోమవారం గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి అతను ఇంద్రనగర్‌ కాలనీకి చెందిన సాయిలుగా గుర్తించారు. కామారెడ్డిలో అడ్డా కూలీగా పనిచేసేవాడని, మృతునికి భార్య, కూతురు ఉన్నారని తెలిపారు. తరచుగా ఫిట్స్‌ వస్తుండేదని పేర్కొన్నారు. కూలీ పని చేసి వచ్చిన అనంతరం మద్యం సేవించి మురికి కాలువపక్కన అరుగుపై పడుకోగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడని వివరించారు. కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Check Also

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *